విజయ్ టాక్స్ కట్టడం లేదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో విజయ్, హీరోయిన్ సమంత, నయనతార ఇళ్లపై ఇన్ కమ్ టాక్స్ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. విజయ్, సమంత, నయనతార తోపాటు నిర్మాతలు శింబు థమేన్, పి.టి సెల్వకుమార్, ఫైనాన్షియర్స్ మధురై అన్బు, రమేష్ ఇళ్లపై కూడా అధికారులు దాడి చేసారు. చెన్నై, మధురై, కొచ్చి, త్రివేండ్రం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ తనీఖీలు నిర్వహించారు. గురువారం రాత్రికి ఈ తనిఖీలు పూర్తయ్యాయి.
ఇన్ కమ్ టాక్స్ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం...హీరోయిన్స్ సమంత, నయనతార ఇన్ టాక్స్ కడుతున్నారు. కానీ గత రెండు సంవ్సరాలుగా పూర్తి స్ధాయిలో టాక్స్ కట్టడం లేదని చెప్పారు. హీరో విజయ్ అయితే ఏకంగా ఐదు సంవత్సరాల నుంచి అసలు టాక్స్ కట్టడం లేదట. విజయ్, సమంత, నయనతార ఈ ముగ్గురు దాదాపు 25 కోట్లు టాక్స్ కట్టలేదని...రెండు కోట్ల నగదు, రెండు కోట్లు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com