సురేందర్ రెడ్డి, వరుణ్‌తేజ్ సినిమా అందుకే ఆగిందా?
- IndiaGlitz, [Sunday,February 16 2020]
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' వంటి హిస్టారికల్ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఏ సినిమా చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు. 'సైరా నరసింహారెడ్డి' తర్వాత సురేందర్ రెడ్డి ప్రభాస్‌తో సినిమా చేస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే ప్రభాస్ తన 20వ సినిమా 'రాధేశ్యామ్'(వినపడుతున్న టైటిల్)తో బిజీగా ఉన్నాడు. తర్వాత సురేందర్ తన దర్శక నిర్మాణంలోనే వరుణ్‌తేజ్‌తో సినిమా చేస్తాడనే వార్తలు కూడా వినిపించాయి. కానీ వరుణ్‌తేజ్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చిరులాంటి అగ్ర కథానాయకుడితో సినిమా చేసిన ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదట.
ఒక పక్క 'రంగస్థలం' వంటి హిట్ తర్వాత సుకుమార్, 'భరత్ అనే నేను' అనే సినిమా తర్వాత కొరటాల శివ కూడా గ్యాప్ తీసేసుకోవాల్సి వచ్చింది. తప్పలేదు. ఇప్పుడు వీరి బాటలోనే సురేందర్ రెడ్డికి కూడా గ్యాప్ వచ్చేలాగానే కనపడుతుంది. అయితే మరో పక్క వరుణ్‌తేజ్ సినిమాను సురేందర్‌రెడ్డితో క్యాన్సిల్ అయిపోవడానికి కారణం..సైరా రిలీజ్ తర్వాత రామ్‌చరణ్, సురేందర్ రెడ్డికి ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వలేకపోవడంతో సురేందర్ దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాడని, ఆ కోపంతోనే మెగా హీరోలు సురేందర్ రెడ్డిని పక్కన పెట్టేశారని కూడా వార్తలు వినపడుతున్నాయి. మరి సురేందర్ రెడ్డి కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.