వరుణ్ తో శ్రీను వైట్ల సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ అనే చిత్రం పూజా కార్యక్రమాలను ఇటీవల ప్రారంభించారు. నల్లమలపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో విదేశాల్లో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేసారు. ఇంతలో ఏమైందో..ఏమో కానీ...ఈ సినిమా కన్నా ముందు వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. దీంతో వరుణ్ తేజ్ - శ్రీను వైట్ల సినిమా ఉన్నట్టా..? లేనట్టా..? అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. అయితే....శ్రీను వైట్ల తో వరుణ్ తేజ్ చేయాలనకున్న సినిమా కథలోని ద్వితీయార్ధం సంతృప్తికరంగా రాకపోవడంతో మళ్లీ సెకండాఫ్ పై వర్క్ చేయమని శ్రీను వైట్లకు చెప్పాడట హీరో వరుణ్ తేజ్. అందుకనే ఈ చిత్రాన్నిప్రస్తుతానికి ఆపినట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com