వ‌రుణ్ తో శ్రీను వైట్ల సినిమా ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

  • IndiaGlitz, [Friday,May 20 2016]

మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో మిస్ట‌ర్ అనే చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌ను ఇటీవ‌ల ప్రారంభించారు. న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో విదేశాల్లో షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేసారు. ఇంత‌లో ఏమైందో..ఏమో కానీ...ఈ సినిమా క‌న్నా ముందు వ‌రుణ్ తేజ్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఈ చిత్రాన్నిశ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. దీంతో వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల సినిమా ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..? అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. అయితే....శ్రీను వైట్ల తో వ‌రుణ్ తేజ్ చేయాల‌న‌కున్న సినిమా క‌థలోని ద్వితీయార్ధం సంతృప్తిక‌రంగా రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ సెకండాఫ్ పై వ‌ర్క్ చేయ‌మ‌ని శ్రీను వైట్ల‌కు చెప్పాడ‌ట హీరో వ‌రుణ్ తేజ్. అందుక‌నే ఈ చిత్రాన్నిప్ర‌స్తుతానికి ఆపిన‌ట్టు స‌మాచారం.

More News

హాట్ స్టార్ నూత‌న ప్ర‌చారాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్..

భార‌త‌దేశ‌పు అతి పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంది.స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక చేసుకుంది. ఉత్సాహ‌పూరిత‌మైన తెలుగు సినిమాలు మ‌రియు షోస్ ను ఆవిష్క‌రించిన హాట్ స్టార్ అన్నీపూర్తి ఉచితంగా అందిస్తుంది.

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబును అభినందించిన మీడియా మొఘల్ రామోజీరావు

ఆరు వందలకు పైగా చిత్రాల్లో నాయకుడు, ప్రతి నాయకుడు, నిర్మాతగా ఇలా అన్ని విభాగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నట జీవితంలో నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

శ్రీమంతుడు బాటలో నందకృష్ణుడు

మహేశ్ అంటే పేరు కాదు అదో బ్రాండ్ అయిపోయింది... నేటితరం టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న మహేశ్ ను ప్రేక్షకులే కాదు యంగ్ హీరోలు కూడా ఫాలోఅవుతున్నారు.

అభిమానులు సమక్షంలో ఘనంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలు

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు తనయుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ఈరోజు(మే 20న) తన పుట్టినరోజు వేడుకలను జూబ్లీ హిట్స్ లోని మోహన్ బాబు  నివాసంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో కొత్త చిత్రం 'లక్ష్మీ బాంబ్' ప్రారంభం

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ కొత్త చిత్రం లక్ష్మీ బాంబ్, ఫ్రమ్ శివకాశి ట్యాగ్ లైన్ శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.