ముకేష్ అంబానీ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నటీవీ9 రవిప్రకాష్!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి వీళ్లిద్దరూ బద్ధశత్రువులు కదా..? ఎలా దగ్గరవుతున్నారబ్బా..? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..? అవును మీరు వింటున్నది సోషల్ మీడియాలో గత రెండ్రోజులుగా వస్తున్న పుకార్లు నిజమైతే గనుక కచ్చితంగా టీవీ9 రవిప్రకాష్- వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ 100% దగ్గరవుతారు మరి. అసలు ఈ పంచాయితేంటి..? ఏం జరుగుతోంది..? రవిప్రకాష్ ఎలా దగ్గరువుతున్నారనే విషయం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే మరి.
ఒకప్పుడు ఉప్పు-నిప్పు.. ఇప్పుడు పాలు-పంచదార!!
టీవీ9 రవిప్రకాష్- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతగా.. ఉప్పు-నిప్పులా పరిస్థితులున్న పరిస్థితి తెలిసిందే. ఇందుకు కారణం జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో టీవీ9 వైసీపీ పార్టీని, జగన్ కుటుంబాన్ని పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు.. ఆఖరికి లోటస్‌పాండ్ లోపలికెళ్లి కూడా పెద్ద ఎత్తున హడావుడే చేశారు. అప్పట్లో టీవీ9 ఓ అధికార పార్టీకి వత్తాసు పలుకుతుండటంతో జగన్‌పై వంద కాదు వెయ్యి రెట్లు రివెంజ్ తీర్చుకుంది. దీంతో అప్పట్లో వైఎస్ జగన్ వర్సెస్ టీవీ9గా పరిస్థితులు మారాయి. అయితే ఇప్పుడు అవన్నీ పూర్తిగా మరిచిపోయి పాలు-పంచదారలా కలిసిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చాలా పెద్ద పెద్ద కారణాలే ఉన్నాయి. గత వారం రోజులుగా రవిప్రకాష్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. 8 శాతం టీవీ9లో షేర్లున్న రవిప్రకాష్ 90 శాతం షేర్లతో చానెల్‌ను కొత్తగా కొన్న అలంద మీడియాని ఇబ్బంది పెడుతుండటంతో ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించేశారు.
జగన్‌కు దగ్గరయ్యే పరిస్థితులున్నాయా..?
సీఈవో పదవి పోవడంతో రవిప్రకాష్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారట. ఒకప్పుడు టీవీ9 అంటే రవిప్రకాష్.. రవిప్రకాష్ అంటే టీవీ9గా ఉండేది ఇప్పుడు.. టీవీ9కు రవి లేడు.. ఆ ప్రకాశం లేదన్న మాట!. తనను అవమానపరిచి బయటికి పంపించేసిన టీవీ9 కొత్త యాజమాన్యాన్ని చావుదెబ్బ కొట్టాలనే యోచనలో రవిప్రకాష్ ఉన్నాడట. ప్రస్తుతం రవిప్రకాష్ మూడు మార్గాలు ముందున్నాయట. ఒకప్పుడు తెలుగు మీడియాలో ఓ వెలుగు వెలిగిన ఐ న్యూస్‌ను వైసీపీ అధినేత జగన్ కొనబోతున్నారట.
ఇప్పటికే ఎంపీ విజయసాయి మధ్యవర్తిత్వంతో భేరసారాలు సాగుతున్నాయని సమాచారం. ఇదే గనుక వైసీపీ వాళ్ల చేతిలోకి రాగానే.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రవిప్రకాష్‌ను రంగంలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రవిప్రకాష్ ఎంత చిన్న చానెల్‌ను అయినా నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లగలడని ఓ నమ్మకం అందరిలోనూ ఉంది. కాగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ప్రస్తుతం ఈ రేంజ్లో ఉందంటే అందులో మొదటి కారణం.. కారకుడు రవిప్రకాష్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమే మరి.
ఎవరికి దగ్గరవుతారో..!
ఇదిలా ఉంటే.. రవిప్రకాష్ బావమరిది ఇప్పటికే ‘మోజో’ చానెల్‌ను విజయవంతంగా నడుపుతున్న విషయం విదితమే. ఇది కూడా టీవీ9కు దగ్గర్లోనే ఆఫీస్ ఉంది. టీవీ9 స్టాఫ్ మొత్తాన్ని అక్కడికి తరలించి సొంత చానెల్‌గా భావించి మోజోను జాకీలేసి ఎత్తాలనే యోచనలోనూ రవిప్రకాష్ ఉన్నారట. ఇక ఈ రెండు అటుంచితే జాతీయ స్థాయిలో టాప్‌లో ఉన్న సీఎన్ఎన్-న్యూస్ 18 అధిపతి రిలయన్స్ ముకేష్ అంబానీ ఎప్పట్నుంచో తెలుగు రాష్ట్రాల్లో ఓ చానెల్ పెట్టాలని భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం విదితమే.దీంతో ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్న రవిప్రకాష్ రిలయన్స్ అధినేతను కలిసే పనిలో ఉన్నారట. అపాయింట్మెంట్ కుదరగానే రిలయన్స్ అధినేతను కలిసి చానెల్ గురించి చర్చించాలని యోచనలో ఉన్నారట. సో.. మొత్తానికి చూస్తే అటు వైఎస్ జగన్‌కు దగ్గరవుతారా..? ఇటు రిలయన్స్ అధిపతికి దగ్గరవుతారా..? లేకుంటే బావమరిదికి దగ్గరవుతారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com