త్రివిక్రమ్ మళ్లీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... హీరో నితిన్ తో చేస్తున్న సినిమా టైటిల్ అ ఆ.. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి..సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...త్రివిక్రమ్ నితిన్ తో చేసే సినిమా కథ ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా కథ గురించి నితిన్ అడిగితే... త్రివిక్రమ్ స్టైయిల్లో ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పారు.
అయితే ఈ సినిమా గురించి మాకు అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమాకు కూడా అత్తారింటికి దారేది తరహా కథనే ఎంచుకున్నారట. పూర్తి వినోదాత్మకంగా సినిమా ఉంటుందట. ఈ సినిమాలో కూడా అత్త పాత్రను నదియా పోషిస్తుందని సమాచారం. ఇదంతా చూస్తుంటే త్రివిక్రమ్ మళ్లీ హిట్ కోసం అత్త..అల్లుడు ఫార్ములానే ననమ్ముకున్నట్టు అనిపిస్తుంది. మరి...ఈసారి కూడా అత్త, అల్లుడు ఫార్ముల పని చేస్తుందా..? లేదా.. అనేది తెలియాలంటే జనవరి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com