త్రిష కోరిక తీరుతుందా..

  • IndiaGlitz, [Monday,November 30 2015]

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌..ఇలా సౌత్ మూవీస్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకుంది నిషా క‌ళ్ళ త్రిష‌. త‌మిళ్ లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న న‌టించింది. కానీ..సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించ‌లేదు. దీంతో ర‌జ‌నీ స‌ర‌స‌న న‌టించాల‌నే త్రిష కోరిక ఇప్ప‌టి వ‌ర‌కు తీర‌లేదు.

ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం క‌బాలి చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ర‌జనీకాంత్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రోబో 2 లో న‌టించ‌నున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే త్రిష రోబో 2లో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తుంద‌ట‌. మ‌రి..త్రిష ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా..? ర‌జ‌నీ స‌ర‌స‌న న‌టించాల‌నే త్రిష కోరిక తీరుతుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.