మోహన్ లాల్‌కి టైటిల్ సమస్యలు తెచ్చి పెడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇప్పుడు బాలీవుడ్, దక్షిణాది భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగాఉన్నారు. తాజా ఆయన నటిస్తోన్న మరో చిత్రం ఖరారైంది. ఆ చిత్రం పేరు `రామ్`. `హీ హేస్ నో బౌండరీస్`(అతనికి సరిహద్దులు లేవు) అనేది ఉపశీర్షిక. గతంలో మోహన్‌లాల్‌తో దృశ్యం వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ హిట్ కాంబినేషన్లో మోహన్‌లాల్‌కు జోడిగా త్రిష నటిస్తుంది. ప్యాషన్ స్టూడియోస్, అభిషేక్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు కానీ.. ఇప్పుడు స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని సంబంధం లేకుండా సినిమాలకు సంబంధించి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌పై వివాదం నెలకొంటుందా? అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అయోధ్య వివాదం ముగిసింది. రామ మందిరం నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో అసలు మోహన్ లాల్ `రామ్` సినిమా కథేంటి? అసలు టైటిల్‌ను ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పుకుంటారా? అనేది ఆలోచించాల్సిన విషయమే! టైటిల్ విషయంలో విడుదల వరకు ఎలాంటి వివాదాలు వస్తాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments