మోహన్ లాల్‌కి టైటిల్ సమస్యలు తెచ్చి పెడుతుందా?
- IndiaGlitz, [Tuesday,December 17 2019]
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇప్పుడు బాలీవుడ్, దక్షిణాది భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగాఉన్నారు. తాజా ఆయన నటిస్తోన్న మరో చిత్రం ఖరారైంది. ఆ చిత్రం పేరు 'రామ్'. 'హీ హేస్ నో బౌండరీస్'(అతనికి సరిహద్దులు లేవు) అనేది ఉపశీర్షిక. గతంలో మోహన్‌లాల్‌తో దృశ్యం వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ హిట్ కాంబినేషన్లో మోహన్‌లాల్‌కు జోడిగా త్రిష నటిస్తుంది. ప్యాషన్ స్టూడియోస్, అభిషేక్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు కానీ.. ఇప్పుడు స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని సంబంధం లేకుండా సినిమాలకు సంబంధించి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌పై వివాదం నెలకొంటుందా? అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అయోధ్య వివాదం ముగిసింది. రామ మందిరం నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో అసలు మోహన్ లాల్ 'రామ్' సినిమా కథేంటి? అసలు టైటిల్‌ను ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పుకుంటారా? అనేది ఆలోచించాల్సిన విషయమే! టైటిల్ విషయంలో విడుదల వరకు ఎలాంటి వివాదాలు వస్తాయో వేచి చూడాలి.