Viveka Wife:ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం..? సీఎం జగన్‌కు వివేకా సతీమణి లేఖ..

  • IndiaGlitz, [Thursday,April 25 2024]

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రోజు ఏదో ఒక అంశంతో ఈ కేసు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న సొంత చెల్లెళ్లపై నిందలు వేస్తూ హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నకే ఇలా జరిగింది అంటూ లేఖలో పేర్కొన్నారు.

2009లో జగన్‌ తన తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించారని.. 2019లో సునీత కూడా తన తండ్రిని పోగొట్టుకుని అంతే మనోవేదన అనుభవించారు. అంతేకాకుండా మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం మరింత బాధపెట్టింది. నీ పత్రిక, టీవీ ఛానల్‌, పార్టీ వర్గాలు తీవ్రరూపంలో మాట్లాడారు. చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా, పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి' అంటూ వాపోయారు.

న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారు. కొంతమంది దాడులకూ తెగబడేస్థాయికి దిగజారుతున్నా నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలనూ టార్గెట్‌ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి?. కుటుంబసభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం కల్పించడం. ఇది సమంజసమా..? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్‌ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని వేడుకుంటున్నా అంటూ లేఖలో వెల్లడించారు.

అంతకుముందు పులివెందులలో నామినేషన్ వేసే సందర్భంగా వైఎస్ షర్మిల, సునీత రెడ్డిలు టార్గెట్‌గా సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన నిందితుడికి మద్ధతిస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? అవినాష్‌రెడ్డి ఏ తప్పు చేయలేదు.. అవినాష్‌ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు. పసుపు మూకల కుట్రలో చెల్లెళ్లు భాగమయ్యారు. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్సార్‌ వారసులు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

More News

Telugu Actress:తెలంగాణలో ఎంపీ అభ్యర్థిగా తెలుగు నటి.. ఎవరో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు 15 రోజులు మాత్రమే సమయం ఉండంటంతో

Memantha Siddham:'మేమంతా సిద్ధం' యాత్రకు అనూహ్య స్పందన.. చేతులెత్తేసిన టీడీపీ అభ్యర్థులు..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర బుధవారంతో ముగిసింది.

Vijayawada CP:ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్.. విజయవాడ సీపీగా ఎవరంటే..?

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజిత్‌, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

CM Jagan:వీళ్లా వైఎస్సార్ వారసులు..? వివేకా హత్యపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తనపై చేస్తున్న ఆరోపణల గురించి సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Prime Minister Modi:ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఎన్ని రోజులంటే..?

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారం వాడివేడి జరుగుతోంది. అన్ని పార్టీలు మెజార్టీ స్థానాలే గెలవాలనే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి.