రాజ‌మౌళి చిత్రంలో ట్విస్ట్ ఇదేనా?

  • IndiaGlitz, [Thursday,October 25 2018]

బాహుబ‌లి ద‌ర్శ‌కుడు త‌దుప‌రి ఏ సినిమా చేస్తాడోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఈ సంద‌ర్భంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో రాజ‌మౌళి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఈ అంచ‌నాల‌ను రెండింత‌లు చేసుకున్నారు. సినిమా న‌వంబ‌ర్ 18న సినిమా మొద‌లు కానుంది.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు ఓ ట్విస్ట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగ‌టివ్ షేడ్స్‌తో క‌నిపిస్తే.. రామ్‌చ‌ర‌ణ్ హీరో అత‌న్ని ప‌ట్టుకోవాల‌నే క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌.

సాధార‌ణంగా రాజ‌మౌళి సినిమాలో హీరో కంటే విల‌న్ పాత్రే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర‌ను.. దాన్ని ఢీ అన‌బోయే పాత్రలో రామ్‌చ‌ర‌ణ్‌ను ఎలా చూపిస్తారోన‌ని అంటున్నారు.