'పుష్ప'లో బన్నీ సర్‌ప్రైజ్ ఇదేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంలో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బన్నీ డిఫరెంట్ హెయిర్ స్టైల్, రగ్డ్ లుక్‌తో కనపడ్డారు. ఫస్ట్ లుక్ చూసిన వారందరూ బన్నీ లుక్ కొత్తగా ఉందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బన్నీ డబుల్ షేడ్స్ లో కనపడ బోతున్నారట. అందులో ఓ షేడ్ మాస్‌గా, రగ్డ్‌గా ఉంటే మరో షేడ్ స్టైలిష్‌గా ఉంటుందట. సినీ వర్గాల్లో వినపడుతున్న టాక్ ప్రకారం బన్నీ ‘పుష్ప’ చిత్రంలో డాన్‌గా కూడా కనపడతారట. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా మా షూటింగ్ మొదలవుతుంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినపడతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com