'పుష్ప'లో బ‌న్నీ స‌ర్‌ప్రైజ్ ఇదేనా..?

  • IndiaGlitz, [Monday,April 20 2020]

టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంలో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బన్నీ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, ర‌గ్డ్ లుక్‌తో కనపడ్డారు. ఫ‌స్ట్ లుక్ చూసిన వారంద‌రూ బన్నీ లుక్‌ కొత్తగా ఉందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వ‌ర‌కు చాలా వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి.

అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బన్నీ డబుల్ షేడ్స్ లో కనపడ బోతున్నారట‌. అందులో ఓ షేడ్ మాస్‌గా, ర‌గ్డ్‌గా ఉంటే మ‌రో షేడ్ స్టైలిష్‌గా ఉంటుంద‌ట‌. సినీ వర్గాల్లో విన‌ప‌డుతున్న టాక్ ప్ర‌కారం బన్నీ ‘పుష్ప’ చిత్రంలో డాన్‌గా కూడా కనపడతారట. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైరస్ కారణంగా ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా మా షూటింగ్ మొదలవుతుంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ‌తున్నాయి.

More News

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా గురించి జ‌క్క‌న్న ఏం చెప్పారంటే...!!

ఇండియ‌న్ సినిమాలో ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్. ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగాఫ్యాన్స్ కంగారు

ఇప్పుడు మెగాఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నార‌ట‌. అందుకు కార‌ణంగా మెగాస్టార్ చిరంజీవి ఓ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాన‌ని రీసెంట్‌గా ప్ర‌క‌టించ‌డ‌మే

తార‌క్‌, చెర్రీల‌కు రాజ‌మౌళి స‌వాల్‌

లాక్‌డౌన్ వేళ సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇళ్ల‌ల్లోకి ప‌ని మ‌నుషుల‌ను కూడా సెల‌బ్రిటీలు రానీయ‌డం లేదు స‌రిక‌దా! ఎవ‌రింటి ప‌నిని వారే చేసుకుంటున్నారు.

3 నెలలు ఇంటి అద్దె వసూలు చేయొద్దు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల పాటు ఇంటి అద్దె వసూలు చేయొద్దని ఓనర్స్‌కు సీఎం కేసీఆర్ ఒకింత వార్నింగ్.. విజ్ఞప్తి చేశారు.

బ్రేకింగ్: మే-07 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం నాడు కేబినెట్ భేటీలో సుధీర్ఘంగా చర్చించిన అనంతరం తెలంగాణలో మే-07 వరకు