23న నాగ్ ఇచ్చే స‌ర్ ఫ్రైజ్ ఇదేనా..

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫ్రెష్ ఫ్యూర్ ల‌వ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఓ స్పెష‌ల్ రోల్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్యారెక్ట‌ర్ ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే... నిర్మ‌లా కాన్వెంట్ లేటెస్ట్ టీజ‌ర్ ను నాగార్జున ట్విట్ట‌ర్ లో రిలీజ్ చేసి ఈ నెల 23న మీకు ఓ స‌ర్ ఫ్రైజ్ ఇవ్వ‌బోతున్నాను అని తెలియ‌చేసారు. దీంతో 23న నాగ్ ఇచ్చే స‌ర్ ఫ్రైజ్ ఏమిటి అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. అయితే...ఈ చిత్రంలో నాగార్జున‌కు స్పెష‌ల్ రోల్ తో పాటు ఓ సాంగ్ కూడా ఉంది. సో...నిర్మ‌లా కాన్వెంట్ లో నాగ్ సాంగ్ ని 23న రిలీజ్ చేయ‌నున్నారేమో అనిపిస్తుంది. మ‌రి...నాగ్ ఇచ్చే స‌ర్ ఫ్రైజ్ ఏమిటో తెలియాలంటే 23 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

న‌రేష్ స‌ర‌స‌న ఆ హీరోయిన్‌.

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన `సీమశాస్త్రి`, `సీమటపాకాయ్‌` చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి.

బాల‌య్య సినిమా యూనిట్ గ్యాప్ తీసుకుంది

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` రీసెంట్‌గా జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే నెక్ట్స్ షెడ్యూల్ విష‌యంలో ఇంకా ఏ మాత్రం నిర్ణ‌యం తీసుకోలేదట‌. అందుకు కార‌ణం ద‌ర్శ‌కుడు క్రిష్ అట‌.

మ‌హేష్ - కొర‌టాల మూవీ బ‌డ్జెట్ డీటైల్స్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్... మురుగుదాస్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు.

చిరు 150వ సినిమా కొత్త టైటిల్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అనుష్క సినిమాలో ఎన్టీఆర్ విల‌న్

జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళ న‌టుడు ఉన్నిముకుంద‌న్ రీసెంట్ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ వ‌ర్క్‌ను పూర్తి చేశాడు.