మహేశ్ 27 కథ అదేనా!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ తన 27వ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ నెక్ట్స్ మూవీ లాంఛనంగా ప్రారంభమవుతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ వార్తొకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో వినపడుతున్న సమాచారం మేరకు ఇండియన్ బ్యాంకులను మోసం చేసి కోట్ల రూపాయల నగదు చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన పలువురి నుండి డబ్బును మహేశ్ ఎలా రాబట్టాడనేదే సినిమా ప్రధాన కథాంశమట. ఈ అంశంతో పాటు మదర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా సినిమాలో భాగంగా ఉంటుందని టాక్.
పరుశురామ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. గీత గోవిందం తర్వాత పరుశురాం డైరెక్ట్ చేయబోయే సినిమా ఇదే. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు ప్రముఖంగా వినపడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ సంగీత సారథ్యం వహిస్తారట. అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తారని టాక్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేశ్ భారీ హిట్‌ను సొంతం చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com