మ‌హేశ్ 27 క‌థ అదేనా!

  • IndiaGlitz, [Saturday,May 30 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 31న సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌హేశ్ నెక్ట్స్ మూవీ లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. కాగా ఈ సినిమాకు స‌ర్కారు వారి పాట అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్తలు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమా క‌థ ఇదేనంటూ ఓ వార్తొక‌టి నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఇండియ‌న్ బ్యాంకుల‌ను మోసం చేసి కోట్ల రూపాయ‌ల న‌గ‌దు చెల్లించ‌కుండా విదేశాల‌కు పారిపోయిన ప‌లువురి నుండి డ‌బ్బును మ‌హేశ్ ఎలా రాబ‌ట్టాడ‌నేదే సినిమా ప్ర‌ధాన క‌థాంశ‌మ‌ట‌. ఈ అంశంతో పాటు మ‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ప్ర‌ధానంగా సినిమాలో భాగంగా ఉంటుంద‌ని టాక్‌.

ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. గీత గోవిందం త‌ర్వాత ప‌రుశురాం డైరెక్ట్ చేయ‌బోయే సినిమా ఇదే. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తార‌ట‌. అలాగే ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి విజువ‌ల్స్ అందిస్తార‌ని టాక్‌. ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా సరిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో మ‌హేశ్ భారీ హిట్‌ను సొంతం చేసుకున్నారు.

More News

ఎన్టీఆర్ 31 బ్యాక్‌డ్రాప్ అదేనా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ వివాదం : సి కళ్యాణ్ మరో ఆసక్తికర విషయం!

సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇవాళ కరోనా క్రైసిస్ చారిటీకి సంబంధించిన సభ్యులు..

KCRకు కొత్త అర్థం చెప్పిన KTR!

తెలంగాణ నీటి పారుదల రంగంలో మరో అపురూప ఘట్టం చోటుచేసుకున్న విషయం విదితమే. గోదావరి జలాలు సముద్ర మట్టానికి 530 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నాయి.

లాక్‌డౌన్ 5.0 : జూన్ 14 వరకు పెంపు యోచన!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఇండియాలో ఇంకా తగ్గలేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

వలస కూలీల దయనీయ పరిస్థితిపై హరీశ్ ఆవేదన!

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌‌తో  వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్లు టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో