బ్రూస్ లీ లో చిరు పాత్ర ఇదేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న బ్రూస్ లీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత చిరు తెరపైకి వస్తుండడంతో చిరు పాత్ర ఏమిటనేది ఆసక్తిగా మారింది.
అయితే తాజా సమాచారం ప్రకారం చిరు నిజ జీవిత పాత్రనే తెరపై కూడా పోషిస్తున్నారట. అంటే సినిమా హీరోగానే కనిపిస్తారట.ఈ సినిమాలో రామ్ చరణ్ కష్టాల్లో ఉన్నప్పుడు చిరు వచ్చి హెల్ప్ చేస్తాడట. ఇంకా చెప్పాలంటే... స్టైల్ చిత్రంలో లారెన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు చిరు, నాగ్ వచ్చి లారెన్స్ కి ఎలా హోల్ప్ చేస్తారో... బ్రూస్ లీ చిత్రంలో కూడా చిరు పాత్ర ఇంచు మించు అలాగే ఉంటుందట. ఏది ఏమైనా...చాలా రోజులు తర్వాత చిరు ను తెరపై చూపిస్తున్న బ్రూస్ లీ వచ్చాడంటే ఫ్యాన్స్ కి పండగే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com