ఉయ్యాలవాడ కుటుంబం వెనక్కి తగ్గడం వెనుక కారణం ఇదే ?
- IndiaGlitz, [Friday,October 04 2019]
బ్రిటీష్ వారితో స్వాతంత్య్రోదమం కోసం పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈయన జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా అనుకున్నంత సులభంగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎందుకంటే.. సినిమా మేకింగ్ ఓ కష్టతరమైన విషయమైతే.. మరో పక్క ఉయ్యాలవాడ వంశీకులు తమ కుటుంబానికి చరణ్ ఇస్తానని చెప్పిన ఆర్థిక సాయం చేయలేదంటూ ఆందోళనలు చేశారు. కోర్టుకు, మానవ హక్కుల కమీషన్ దగ్గరకు వెళ్లారు. అయితే తీర్పు నిర్మాత రామ్‌చరణ్‌కు అనుకూలంగానే వచ్చింది.
నిజానికి చరణ్ ఉయ్యాలవాడ వంశీకులకు ఏదో కొంత సాయం చేస్తానని చెప్పాడట. అయితే వారు రూ.5కోట్లు డిమాండ్ చేయడంతో చరణ్ అండ్ టీం కోర్టును ఆశ్రయించిందట. సినిమాకు ముందు చరణ్ కోర్టులో కేసు వేసిన ఆరుగురికి మూడు లక్షల చొప్పున ఇచ్చాడట. ఉయ్యాలవాడ ప్రాంతానికి ఏదో ఒకటి చేస్తానని కూడా మాటిచ్చాడట. భవిష్యత్‌లో ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణకు వస్తానని కూడా చెప్పాడని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలై హిట్ టాక్ సంపాదించుకుని మంచి కలెక్షన్స్‌ను సాధిస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.