శశికళ అందుకే వెనక్కితగ్గారా? తమిళనాట రసవత్తరంగా రాజకీయం

ఇటీవల కాలంలో తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆది నుంచి సీఎం అభ్యర్థిగా ఉండాలని భావించిన శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అవినీతి, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనంతరం బెంగళూరు జైలు నుంచి విడుదలై వచ్చిన తమిళ చిన్నమ్మ శశికళ వస్తూ వస్తూనే సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఏఐఏడీఎంకే జెండా ఉన్న కారుతో ర్యాలీ నిర్వహించి ఒక్కసారిగా ఆమె తిరుగుబాటు సంకేతాలు కూడా ఇచ్చారు. అటువంటిది ఒక్కసారిగా ఆమె అస్త్ర సన్యాసం చేశారు. రాజకీయాల్నించే తప్పుకుంటున్నాని ప్రకటించి పెను సంచలనానికి దారి తీశారు. ఆమె తీసుకున్న నిర్ణయంపై తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఇదిలా ఉండగా.. తాజాగా అన్నాడీఎంకే కూటమికి డీఎండీకే గుడ్‌బై చెప్పేసింది. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో గుడ్‌బై చెబుతున్నట్టు వెల్లడించింది. గత కొన్నాళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. మంగళవారం ఉదయం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కూటమి నుంచి వైదొలగుతున్నట్లు పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగినట్టు విజయ కాంత్‌ ప్రకటన జారీచేయగానే కోయంబేడులోని పార్టీ కార్యాలయం వద్ద వేలాదిమంది కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హర్షం ప్రకటించారు.

అయితే ఈ రెండు పరిణామాల వెనుక బయటకు కనిపిస్తున్న కారణాలు వేరు.. లోగుట్టు మరొకటి ఉందని తెలుస్తోంది. నిజానికి సర్వేలన్నీ అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వచ్చాయని సమాచారం. ఈ సారి అన్నాడీఎంకే దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందని సర్వేలు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశకళ అన్నాడీఎంకే తరుఫున రంగంలోకి దిగితే ఒకవేళ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూస్తే ఒక గోల్డెన్ లెగ్ అన్న టాక్‌ను సొంతం చేసుకోవాల్సి వస్తుందని శశికళ భయపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారీగా పుంజుకున్న డీఎంకేకు తన అవినీతి, అక్రమాస్తుల కేసు అస్త్రంగా మారి ఆ పార్టీ విజయావకాశాలు మరింత మెరుగు పడేందుకు తనే ఆస్కారమిచ్చినట్టు అవుతుందని శశికళ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

అన్నాడీఎంకే కూటమినుంచి వైదొలగటం వల్ల తమ పార్టీకి దీపావళి పండుగ వచ్చినట్టుందని.. తమ పార్టీకి నేడే దీపావళి అని డీఎండీకే నేతలు వెల్లడించారు. ఓ వైపు సీట్ల కేటాయింపులపై అన్నాడీఎంకే అధిష్ఠానంతో చర్చలు జరుపుతూనే మరో వైపు డీఎండీకే మూడు రోజులపాటు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీనిని బట్టి ముందుగానే అన్నాడీఎంకేతో విడిపోయేందుకు ఆ పార్టీ మానసికంగా సిద్ధమై ఉందని తెలుస్తోంది. డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశం ముగిసిన తర్వాత ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎల్‌కే సుధీష్‌ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోతుందని శాపనార్థాలు పెట్టారు. 234 నియోజకవర్గాలలోనూ అన్నాడీఎంకే కూటమికి డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. మొత్తానికి తమిళ రాజకీయాలు ఆసక్తికర అంశాలతో దేశం మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్నాయనడంలో సందేహం లేదు.

More News

‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లిపై గొడవకు దిగిన గ్రామస్తులు

‘కేజీఎఫ్’ హీరో.. కన్నడ స్టార్ యశ్ తల్లిపై ఆమె సొంత గ్రామస్తులంతా గొడవకు దిగారు. యశ్ తల్లి తమ పొలం నుంచి ఉన్న దారిని మూసివేయడంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు

చిరుకి డీహైడ్రేషన్.. అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరు ఖమ్మంలో ఉన్నారు.

నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చేసి: అల్లు అర్జున్

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వరస విజయాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.

గో సంరక్షుడు, గాయకుడు పెంచల్ దాస్‌ను సన్మానించిన పవన్

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన గో సంరక్షుడు చాంద్ బాషాను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సన్మానించారు.

బాలీవుడ్ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చిత్రం చేయనున్న ప్రభాస్..!

‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కటే సినిమాకు కట్టుబడి ఉండాలనే నియమానికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టున్నాడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు.