సోషల్ మీడియా నుంచి వైదొలిగిన కొరటాల శివ.. కారణం అదేనా!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సడెన్ గా తాను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. అలాంటి దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అభిమానుల్లో సహజంగానే అనేక సందేహాలు మొదలవుతాయి.
'సోషల్ మీడియా నుంచి నేను వైదొలుగుతున్నాను. సోషల్ మీడియాతో నాకు మంచి మెమొరీస్ ఉన్నప్పటికీ ఇది పక్కకు తప్పుకోవాల్సిన సమయం. మీ అందరితో నేను మీడియా మిత్రుల ద్వారా టచ్ లోనే ఉంటాను. మాట్లాడుతూ ఉంటాను. మీడియం మారుతుందే తప్ప మన మధ్య బంధం కాదు' అని కొరటాల స్వయంగా ప్రకటించారు.
కొరటాల సోషల్ మీడియా నుంచి పక్కకు తప్పుకోవడంపై స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం తన బిజీ షెడ్యూల్ వల్ల సోషల్ మీడియాకు సమయం కేటాయించలేకపోతున్నానని కొరటాల భావిస్తున్నారట.
తన సినిమాలు, వర్క్ గురించి అభిమానులకు తెలియజేయడానికి రెగ్యులర్ మీడియా ఎలాగూ ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అవసరం లేదని భావిస్తున్నారట. ప్రీప్రొడక్షన్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తదుపరి చిత్రాలకు సంబంధించిన చర్చలతో కొరటాల బిజీగా మారిపోయారు. అందువల్లే సోషల్ మీడియాకు టైం దొరకడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. తర్వాత ఎన్టీఆర్ ని కొరటాల డైరెక్ట్ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇది రెండవ చిత్రం.
— koratala siva (@sivakoratala) June 25, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com