ఓసోస్.. చంద్రబాబు-రామోజీ భేటీకి కారణం ఇదా!?
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మీడియో మొఘల్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి పెద్దగా ప్రాధాన్యత లేదని.. మర్యాదపూర్వకంగానే ఇద్దరూ కలుసుకున్నారని అటు పత్రికల్లో.. ఇటు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. రామోజీ-బాబు మధ్య విడదీయరాని బంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ బంధం ఎక్కడ మొదలైంది..? ఎక్కడి దాకా వెళ్లింది..? ఇంతకీ ఆ బంధం ఏంటి..? నాటి నుంచి నేటి వరకూ ఈ బంధం కొనసాగడానికి కారణాలేంటి..? అన్నది ఇక్కడ అప్రస్తుతం.. అనవసరం కూడా!
ఫిల్మ్ సిటీ వేదికగా భారీ స్కెచ్‌లు!
ఇక భేటీలో ఏం చర్చించారనే విషయానికొస్తే.. పత్రికలు, చానెళ్లల్లో వచ్చిన వార్తలన్నీ నిజం కాదని.. ఈ భేటీ వెనుక పెద్ద గూడుగుట్టానీనే ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ భేటీలో భారీ ప్లాన్‌లే వేశారని తెలుస్తోంది. ఈ భేటీ వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఒకటి టీవీ9 రవిప్రకాష్ వ్యవహారం..? రెండు ఏపీలో టీడీపీ ఓడిపోతే ఏం చేయాలి..? అనే రెండు విషయాలపై సుమారు గంటకు పైగా ప్రధానంగా చర్చలు సాగాయని సమాచారం.
రవిని ఎలా కాపాడుదాం!?
టీవీ9 రవిప్రకాష్‌పై ఫోర్జరీతో పాటు మరో రెండు కేసులు నమోదయ్యాయి.. రవి, శివాజీ ప్రస్తుతం ఎక్కడున్నారో..? ఏం చేస్తున్నారో..? పోలీసుల ముందుకు ఎప్పుడొస్తారో..? తెలియని పరిస్థితి. అయితే అటు ప్రింట్ మీడియాలో ఓ వెలుగు రామోజీ రావు.. ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. పైగా రెండూ కూడా టీడీపీకే సపోర్టుగా నిలిచినవి.. అలాంటిది రవిప్రకాష్ ఇబ్బందికర, సాయం ఆశించే పరిస్థితులో ఉంటే.. చూస్తూ ఊరుకోలేకపోయిన చంద్రబాబు.. రామోజీతో కలిసి ఇలాంటి పరిస్థితిలో ఎలా ముందుకెళ్దాం.. ఏం చేద్దాం..? రవి, శివాజీని ఎలా గట్టెక్కిద్దాం అని నిశితంగా చర్చించి ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆ నిర్ణయం ఏంటన్నది తెలియాలంటే మే-23వరకు వేచి చూడాల్సిందేనట.
టీడీపీ ఓడితే పరిస్థితేంటి..?
మే-23న వెలువడనున్న ఫలితాల్లో టీడీపీకి మేజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటి..? మేజిక్ ఫిగర్ దగ్గర్లో ఉంటే ఏం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? అని రామోజీరావుతో చంద్రబాబు నిశితంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎగ్జిట్స్ పోల్స్ రాకమునుపే ఏపీలో ఎవరు గెలవబోతున్నారు..? అనే పరిస్థితి దాదాపు జనాలకు ఇటు పార్టీల అధినేతలకు తెలిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఎలా ముందుకెళ్దాం..? ఒక వేళ వైఎస్ జగన్ సీఎం అయితే ఎలా ముందుకెళ్లాలి..? ఇలా పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చకు రాగా.. రామోజీరావు మాస్టర్ ప్లాన్ మొత్తం చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. మీడియా మొఘల్ చెప్పిన విషయాలన్నీ విన్న చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చేశారట. సో.. ఇంతకీ ఫలితాల తర్వాత చంద్రబాబు ఏం చేయబోతున్నారు..? టీవీ9 రవిప్రకాష్, గరుడ పురాణం శివాజీలను బాబు ఎలా కాపోడబోతున్నారన్నది ఈ రెండు వ్యవహారాలు మే-23న తేలిపోనున్నాయన్న మాట. మే-23 తర్వాత ఏపీలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout