రాజ‌మౌళి, మ‌హేశ్ సినిమాకు ముహూర్తం అదేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో సినిమాలు చేయాల‌ని నేటి త‌రం క‌థానాయ‌కులంద‌రూ ఎదురుచూస్తుంటారు. బాహుబ‌లితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రాజ‌మౌళి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ని తెరెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో సినిమా చేయ‌డానికి రాజ‌మౌళి అండ్ టీం రెఢీ అవుతున్నారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించేశారు కూడా. మ‌హేశ్‌తో రాజ‌మౌళి చేయ‌బోయే సినిమా గురించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో వార్త నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించ‌బోయే తేదిని ఖ‌రారు చేశార‌ని టాక్ విన‌ప‌డుతుంది. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు పోకిరి, బాహుబ‌లి 2 వంటి ఇండ‌స్ట్రీ హిట్స్ విడుద‌లైన ఏప్రిల్ 28న రాజ‌మౌళి, మ‌హేశ్ సినిమా స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు. అయితే మ‌హేశ్ త‌న కొత్త సినిమాను త‌న తండ్రి కృష్ణ పుట్టిన‌రోజునే స్టార్ట్ చేస్తుంటారు. మ‌రి రాజ‌మౌళి సినిమా విష‌యంలో మ‌హేశ్ త‌న సెంటిమెంట్‌ను మిస్ చేసుకుంటారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి.

More News

బాలీవుడ్‌కి అన‌సూయ... నిజ‌మెంత‌?

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈమె త‌ర్వాత ర‌ష్మీ గౌత‌మ్ ఉన్నారు.

డేవిడ్ వార్నర్‌కు పూరీ అతిథి పాత్ర ఆఫర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.

దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదికగా ఈ వేడుక జరిగింది.

దిల్‌రాజు, ప్ర‌భాస్ చిత్రం... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా 'ఇట్స్ టైమ్ టు పార్టీ' ఫస్ట్ లుక్ విడుదల

బుల్లితెర రాములమ్మ, ప్రముఖ యాంకర్, 'బిగ్ బాస్ 3' ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్స్ టైమ్ టు పార్టీ'. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.