రాజమౌళి, మహేశ్ సినిమాకు ముహూర్తం అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళితో సినిమాలు చేయాలని నేటి తరం కథానాయకులందరూ ఎదురుచూస్తుంటారు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రాజమౌళి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ తారక్, చరణ్‌లతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ని తెరెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌తో సినిమా చేయడానికి రాజమౌళి అండ్ టీం రెఢీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన అధికారికంగా ప్రకటించేశారు కూడా. మహేశ్‌తో రాజమౌళి చేయబోయే సినిమా గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోయే తేదిని ఖరారు చేశారని టాక్ వినపడుతుంది. వినపడుతున్న సమాచారం మేరకు పోకిరి, బాహుబలి 2 వంటి ఇండస్ట్రీ హిట్స్ విడుదలైన ఏప్రిల్ 28న రాజమౌళి, మహేశ్ సినిమా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. అయితే మహేశ్ తన కొత్త సినిమాను తన తండ్రి కృష్ణ పుట్టినరోజునే స్టార్ట్ చేస్తుంటారు. మరి రాజమౌళి సినిమా విషయంలో మహేశ్ తన సెంటిమెంట్‌ను మిస్ చేసుకుంటారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout