హరీశ్‌కు కేటాయించబోయే శాఖ ఇదేనా!?
- IndiaGlitz, [Sunday,September 08 2019]
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, పార్టీకి అన్ని విధాలా అండగా.. కల్వకుంట్ల ఫ్యామిలీకి కట్టప్పగా ఉన్న సిద్ధిపేట ఎమ్మేల్యే హరీశ్ రావుకు కీలక పదవి దక్కనుందా..? హరీశ్‌ను మొదటిసారి కేబినెట్‌లోకి తీసుకోని కేసీఆర్.. రెండోసారి మాత్రం కచ్చితంగా తీసుకోవడమే కాకుండా కీలక శాఖ అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ శాఖ ఏది..? పాత శాఖే ఇస్తారా..? లేకుంటే కొత్తగా ఏదైనా శాఖ కేటాయిస్తారా అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై టీఆర్‌ఎస్, తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్, గుత్తా, వినోద్‌తో కేసీఆర్ నిశితంగా చర్చించి.. ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వాలనేది ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మార్పులు చేర్పులు ఇవీ..
మహమూద్ అలీ: హోంశాఖ నుంచి మైనార్టీ సంక్షేమ శాఖ
జగదీష్‌రెడ్డి : విద్యాశాఖ నుంచి విద్యుత్ శాఖ
ఈటల రాజేందర్: ఆరోగ్యశాఖ నుంచి విద్యాశాఖ
కొత్త మంత్రులు వీరే..
కేటీఆర్ : ఐటీ, మున్సిపల్ శాఖ
హరీశ్‌రావు : ఆర్థిక లేదా ఇరిగేషన్ శాఖ
సబితాఇంద్రారెడ్డి : హోంశాఖ
పువ్వాడ అజయ్ : వైద్య, ఆరోగ్యశాఖ
సత్యవతి రాథోడ్ : స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.