ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు ఇదేనా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రయోగాలు మాత్రం ఇంకా ప్రపంచ దేశాలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అదేమిటంటే.. మలేరియా-కోవిడ్-19కు క్లోరోక్విన్ అనే పాత మలేరియా డ్రగ్ ఔషదం పనిచేస్తుందనేది దాని సారాంశం. కోవిడ్-19 చికిత్సకు దశాబ్దాల నాటి మలేరియా మందు పనిచేయగలదా? అనే పరిశోధన చేయగా.. నిజమే ఇది వర్కవుట్ అవుతుందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే కోవిడ్-19 కోసం క్లోరోక్విన్‌ను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని కొందరు వైద్యులు చెబుతున్నారు. కాగా.. క్లోరోక్విన్ (హైడ్రాక్సీ క్లోరోక్విన్) అనే డ్రగ్ 1944 నుంచి మలేరియా చికిత్సకు ఉపయోగించబడింది. మలేరియా సంక్రమణను నివారించడానికి దీనిని వాడటం జరిగింది.
క్లోరోక్విన్ సరైనదేనా!?
మలేరియా.. కోవిడ్-19 పరాన్నజీవి వల్ల కలిగే వ్యాధులు. అయినప్పటికీ, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ లేదా కోవిడ్ రెండూ ఒకే జాతికి చెందినవిగా వైద్యులు చెబుతున్నారు. సార్స్ చికిత్సలో క్లోరోక్విన్ యొక్క ప్రభావాన్ని బట్టి.. కోవిడ్-19కి కొత్త కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ఇది సమర్థవంతమైన చికిత్సా..? కాదా..? అని శాస్త్రవేత్తలు పరిశోధించారు. ప్రారంభ పరీక్షలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సార్స్ ప్రయోగంలో క్లోరోక్విన్ ప్రభావవంతంగా ఉందని ఆధారాలు ఉన్నాయని న్యూయార్క్ నగరంలోని లెనోక్స్ హిల్ హాస్పిటల్‌లోని పల్మోనాలజిస్ట్, ఇంటర్నిస్ట్ డాక్టర్ లెన్ హోరోవిట్జ్ తెలిపారు. క్లోరోక్విన్ వైరల్ సంక్రమణను నివారించడానికి లేదా వైరల్ ఇన్ఫెక్షన్ పనిచేస్తుందని.. దీన్ని ఉపయోగించినప్పుడు వైరల్ కణాలు గణనీయంగా తగ్గినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.
ట్రంప్ ప్రకటన కూడా..!
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అన్ని దేశాల్లోనూ ఆసక్తిని రేపుతోంది. కొవిడ్-19కు మలేరియా చికిత్సలో వాడే క్లోరోక్విన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన కూడా ప్రకటించారు. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు ఎఫ్‌డీఏ ఆమోదం కూడా తెలిపినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ‘కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్‌ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదించింది. ఇప్పటికిప్పుడు ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. అంతేకాదు, ఎఫ్‌డీఐ అనుమతి కోసం ఇతర యాంటీవైరల్ ఔషధాలను కూడా గుర్తించనుంది’ అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments