‘ఆచార్య’ సినిమాకు స్ఫూర్తి అదేనా..?
- IndiaGlitz, [Wednesday,January 06 2021]
డైరెక్టర్ కొరటాల శివ తన కథలను నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకుంటాడని ఆయన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’ సినిమాను చూస్తే అదే అర్థమవుతుంది. దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అనే అంశంపై ఆచార్య సినిమా ఉంటుందని సినీ వర్గాల సమాచారం. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగిన ఆలయ భూముల అన్యాక్రాంతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి ఘటనలను ఆధారంగా చేసుకునే ఆచార్య సినిమా కథను రాసుకున్నారని అంటున్నారు. అందుకనే సినిమాలో ధర్మస్థల అనే ఊరిని కూడా చూపిస్తున్నట్లు టైటిల్ ప్రోమోలో తెలుస్తుంది.
చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో కనిపిస్తే.. నక్సలైట్ నాయకుడు పాత్రలో రామ్చరణ్ కనిపిస్తారట. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా కోసం కోకాపేటలోని ఇరవై ఎకరాల్లో వేసిన భారీ ఆలయ సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.