రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి తేదీ కుదిరిందా?
- IndiaGlitz, [Tuesday,December 22 2020]
డిసెంబర్ 31న తన రాజకీయకి సంబంధించిన అధికారిక ప్రకనట చేసి జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇప్పటకే అభిమానులకు, రాజకీయ నేతలకు చెప్పేశాడు. తలైవా అనౌన్స్‌మెంట్‌తో పొలిటికల్ హీట్ పెరిగింది. రజినీకాంత్ తన పార్టీకి మక్కల్ సేవై కట్చి అనే పేరుని, తన పార్టీకి ఆటో గుర్తు ఖరారు చేసేశారని ఆసక్తికరమైన కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
రజినీకాంత్ తన పార్టీకి సంబంధించిన పేరు, లోగో తదితర వివరాలను జనవరి 14 లేదా జనవరి 17న చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళులకు ఎంతో ఇష్టమైన పండుగ జనవరి 14 ప్రకటన చేస్తారు లేదా.. తమిళ ఆరాధ్య హీరో, రాజకీయ నాయకుడు అయిన ఎంజీఆర్ పుట్టినరోజు జనవరి 17. ఆ రోజునైనా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ఆఫీషియల్ ఉండే అవకాశాలున్నాయంటున్నారు. కొన్నిరోజుల్లో తలైవా పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రకటన రావడం మాత్రం పక్కా.