చరణ్ నెక్ట్స్ మూవీ ఇదేనా...?
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.దసరా కానుకగా బ్రూస్ లీ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.. అయితే బ్రూస్ లీ చిత్రం తర్వాత చరణ్ తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో నటించనున్నట్టు సమాచారం.
ఈ చిత్రం చూసిన రామ్ చరణ్ తెలుగు రీమేక్ లో నటించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమాలో చరణ్ పోలీసాఫీర్ గా నటించనున్నారు. తని ఒరువన్ చిత్ర దర్శకుడు జయం రాజానే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తారట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే చరణ్, సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయాలనుకున్నారు. మరి..రెండు సినిమాలు ఒకేసారి చేస్తారా..? లేక.. ముందు తని ఒరువన్ రీమేక్ స్టార్ట్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com