అనుష్క ఫస్ట్‌ ఛాయిస్‌ కాదా..?

  • IndiaGlitz, [Monday,September 21 2020]

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. రీసెట్‌గా గాంధీ జయంతి రోజున నిశ్శబ్దం సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోనవెంకట్‌, విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ముందుగా కరోనా ప్రభావం లేకుంటే ఏప్రిల్ 2న సినిమాను విడుద‌ల చేద్దామనుకున్నారు. . కానీ క‌రోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో సినిమాను డిజిటల్‌ మాధ్యమం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు.

కాగా.. ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని) పాత్రలో నటించింది. అయితే ముందుగా మేకర్స్‌ ఈ పాత్రకు అనుష్కను తీసుకోవాలని అనుకోలేదట. అటు బాలీవుడ్, ఇటు సౌత్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలైన తాప్సీ అయితే బావుంటుందని ఆలోచించి ఆమెను కలిశారట. అయితే తాప్సీ డైరీ ఖాళీ లేకపోవడంతో ఆమె సున్నితంగా నో చెప్పేశారట. అప్పుడు కోనవెంకట్‌ విమానంలో అనుకోకుండా అనుష్కను కలుసుకోవడం.. విమానం ఆలస్యం కావడంతో అక్కడే ఆమెకు కథను వివరించడం, అనుష్కకు కథ నచ్చడం జరిగాయి. క్రాస్‌ జోనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని అమెరికాలోనే చిత్రీకరించారు. మాధవన్‌, అంజలి, అండ్రూహడ్సన్‌, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు.

More News

వేంకటేశ్వరునిపై కొడాలి నాని వ్యాఖ్యలపై శ్రీనివాసానంద కన్నీళ్లు..

వేంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపుతున్నాయి.

రైతులకు అండగా కార్తీ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..

రైతుల ఆదుకునేందుకు హీరో కార్తీ నడుం బిగించారు. ఇది ఒక్క ఏడాదితో పోయేలా కాకుండా నిరంతరం కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌'పై కీరవాణి అప్‌డేట్‌..!

రెండు వందలకు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సీనియర్‌ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్..

నటి రేణూ దేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారు.

ఎన్టీఆర్ 30 కీల‌క పాత్ర‌లో శివ‌గామి!

ర‌మ్య‌కృష్ణ టాలీవుడ్ సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో బాహుబ‌లి పుణ్య‌మాని రాజ‌మాత శివ‌గామి దేవిగా తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకుంది.