జూనియర్ ఎన్టీఆర్ ప్రెజర్ పెడుతున్నాడా?
- IndiaGlitz, [Saturday,March 09 2019]
దర్శకుడు రాంగోపాల్ వర్మను జూనియర్ ఎన్టీఆర్ ప్రెజర్ పెడుతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఇంతకు జూనియర్ వర్మను ఎందుకు ప్రెజర్ పెడుతున్నాడనే సందేహం రావచ్చు. ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసమేనని వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో హరికృష్ణ రెండో భార్యగా షాలినిని చిన్నచూపు చూస్తే.. లక్ష్మీ పార్వతి షాలిని, జూనియర్ ఎన్టీఆర్‌లను చేరదీసిందట.
ఈ విషయాన్ని లక్ష్మీపార్వతి చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పుకొచ్చింది. అయితే సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జూనియర్ ఆమె గురించి పెద్దగా పట్టించుకోలేదు. అందుకు చాలా కారణాలుండొచ్చు. ఇప్పుడు ఈ విషయాన్ని వర్మ తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చూపించబోతున్నాడట. సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల ఫోటోను ఓ చిన్నపిల్లవాడు కన్నీటితో బయటకు విసిరేయడం చూపిస్తారట. అయితే అది జూనియర్ ఎన్టీఆర్ అని డైరెక్ట్‌గా కాకుండా.. ఇన్ డైరెక్ట్‌గా వర్మ చూపించాడని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ తన మావయ్య, వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ లీడర్ నార్నే శ్రీనివాస్ ద్వారా ఆ సీన్‌ను తొలగించమని ప్రెజర్ పెట్టిస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి.