నాని సినిమాకు సీక్వెల్ ఉందా ?
Send us your feedback to audioarticles@vaarta.com
నాని సినిమాకు సీక్వెలా ఉందా? అవును నాని నిర్మిస్తున్న హిట్ సినిమాకు సీక్వెల్‌గా హిట్ 2 చేస్తున్నారుగా అనుకునురు. కానీ ఇక్కడ నాని నిర్మాతగా చేస్తున్న సినిమా కాదు. నాని హీరోగా చేసిన సినిమా. నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ వి. ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా..సుధీర్ బాబు అతన్ని పట్టుకోవాలనుకునే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్. ఈ సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడింది.
చిత్ర యూనిట్ ఈ విషయాన్ని తెలియజేస్తూ వి చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సమాయత్తమవుతున్నారు. కాగా.. సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం మేరకు నాని, దిల్‌రాజు అండ్ టీమ్ వి సినిమాకు సీక్వెల్‌ను చేయాలనుకుంటున్నారట. వి సినిమా క్లైమాక్స్ కూడా సీక్వెల్ ఉంటుందని చెబుతూ హింట్ ఇస్తూ ముగుస్తుంది. అయితే ప్రస్తుతం నాని డైరీ ఈ ఏడాదికి నిండిపోయింది కాబట్టి వి సీక్వెల్ వచ్చే ఏడాదిలోనే ఉండే అవకాశాలున్నాయంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments