నాని సినిమాకు సీక్వెల్ ఉందా ?

  • IndiaGlitz, [Thursday,March 19 2020]

నాని సినిమాకు సీక్వెలా ఉందా? అవును నాని నిర్మిస్తున్న హిట్ సినిమాకు సీక్వెల్‌గా హిట్ 2 చేస్తున్నారుగా అనుకునురు. కానీ ఇక్క‌డ నాని నిర్మాత‌గా చేస్తున్న సినిమా కాదు. నాని హీరోగా చేసిన సినిమా. నాని, మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ వి. ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌గా..సుధీర్ బాబు అత‌న్ని ప‌ట్టుకోవాల‌నుకునే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లు. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్స్‌. ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ సినిమా కరోనా ప్ర‌భావం కార‌ణంగా వాయిదా ప‌డింది.

చిత్ర యూనిట్ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ వి చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. కాగా.. సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు నాని, దిల్‌రాజు అండ్ టీమ్ వి సినిమాకు సీక్వెల్‌ను చేయాల‌నుకుంటున్నార‌ట‌. వి సినిమా క్లైమాక్స్ కూడా సీక్వెల్ ఉంటుంద‌ని చెబుతూ హింట్ ఇస్తూ ముగుస్తుంది. అయితే ప్ర‌స్తుతం నాని డైరీ ఈ ఏడాదికి నిండిపోయింది కాబ‌ట్టి వి సీక్వెల్ వ‌చ్చే ఏడాదిలోనే ఉండే అవ‌కాశాలున్నాయంటున్నారు.

More News

మహారాష్ట్ర భక్తుడి ఎఫెక్ట్ : తిరుమలలో దర్శనాలు నిలిపివేత

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలేశునిపై కూడా పడింది. ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టీటీడీ తాజాగా.. స్వామి వారికి కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ..

ఆశలు ఆవిరి.. నిర్భయ నిందితులకు రేపే ఉరి..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతి భయంకరమైన నిర్భయ కేసులో ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారైపోయింది. ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ అవ్వగా.. దోషులు సుప్రీంకోర్టు, రాష్ట్రపతిని ఆశ్రయిండంతో

కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. ఇలా చేయండి..: చిరంజీవి

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ అన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్‌లో అందరి కంటే ముందుగా తన ‘ఆచార్య’ సినిమాను షూటింగ్‌ను

సంపర్క్ క్రాంతి-ఎస్9 : కరోనా భయంతో వణికిపోతున్న కరీంనగర్!

కరోనా పేరెత్తితో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌లు పెరిగిపోతుండటం.. మరోవైపు అనుమానిత కేసులు సైతం ఎక్కువవుతుండటంతో ప్రభుత్వాలు తగు

ఏపీకి వచ్చిన ఆ 185 మందికి కరోనా లేదు!

కరోనా వైరస్‌ మూలంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను కేంద్రం సహాయంతో స్వదేశానికి రప్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.