close
Choose your channels

అఖిల్ సినిమా టైటిల్ ఫిక్స్ అయిందా...?

Thursday, August 20, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేనివా వారి మూడో తరం నాయకుడు , అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ ఇటీవల సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి విదితమే. నితిన్ తన హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు.

మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మిసైల్` అనే టైటిల్ పరిశీలనలో ఉందని అప్పట్టో ఫిలింనగర్ల లో వార్తలు వినపడ్డాయి. అయితే నిర్మాతలు అప్పట్లో టైటిల్ అది కాదని తేల్చేశారు. అయితే తాజాగా సినిమా ఫస్ట్ లుక్ ను నాగార్జున బర్త్ డేను ఆగస్ట్ 29న రిలీజ్ చేస్తున్నారు. నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆడియో విడుదల చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని అక్టోబర్ 21న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే టైటిల్ విషయంలో మాత్రం తర్జన భర్జనలు పడుతున్నారట. అయితే అఖిల్ నటిస్తున్నాడని ప్రొడక్షన్ A అని పెట్టిన నిర్మాతలు. అదే సెంటిమెంట్ ను కొనసాగించేలా Mr.అఖిల్` అని టైటిల్ పెట్టాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment