ఏపీలో 3 రాజధానుల వెనుక వ్యూహమిదేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి పరిస్థితేంటి..? అని నాటి నుంచే రాజధానికి భూములిచ్చిన, పరిసర ప్రాంతాల రైతులు ముఖ్యంగా యావత్ తెలుగు ప్రజానీకంలో పలు అనుమానాలు రేకెత్తాయి. అనుకున్నట్లుగానే వైసీపీ ప్రభుత్వం రానే వచ్చింది.. ఇప్పటికే పలుమార్లు మంత్రి బొత్సా సత్యనారాయణ రోజుకో ప్రకటన చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు. ఆయన రాజధానిపై అన్నెన్ని ప్రకటనలు చేసినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం ఏ రోజూ పెదవి విప్పలేదు. ఆఖరికి ఇవాళ అసెంబ్లీ వేదికగా.. ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందా..? మరో చోటుకు మారుస్తారా..? అనేదానిపై తేల్చేశారు.
జగన్ చెప్పినట్లు ఎక్కడేముంటాయ్!?
సౌతాఫ్రికా మోడల్ తరహాలో ఏపీలో కూడా బహుశా మూడు రాజధానులు రావొచ్చు
అమరావతి : చట్టసభలు
విశాఖపట్నం : ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
కర్నూలు : హైకోర్టు
సౌతాఫ్రికాలో ఎక్కడేమున్నాయ్!
దక్షిణాఫ్రికా : ప్రిటోరియా, కేప్‌టౌన్, బ్లోమ్‌ఫాంటేన్ అనే మూడు రాజధానులు
ప్రిటోరియా : అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ (ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల కార్యాలయాలు)
కేప్‌టౌన్ : లెజిస్లేచివ్ క్యాపిటల్ (చట్టసభలు)
బ్లోమ్‌ఫాంటేన్ : సుప్రీంకోర్టు
సేమ్ టూ సేమ్!
మొత్తానికి చూస్తే.. సౌతాఫ్రికా దేశం గనుక.. అక్కడ సుప్రీంకోర్టు.. ఇక హైకోర్టు అంతే. మిగతావన్నీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో జగన్‌లో బలంగా ఉందని అసెంబ్లీలో మాటలను బట్టి చూస్తే తెలుస్తోంది. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే తనదైన పాలనా మార్క్‌ను ఎనిమిది నెలల్లోనే చూపించారు. మరోవైపు రాజధానిపై ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేసి ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.
వికేంద్రీకరణ సాధ్యమేనా!?
పై విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడిక్కడ ప్రాంతాలన్నీ చాలా బాగా అభివృద్ధి చెందాయని తెలుగు రాష్ట్రాలకు నిపుణులు చెబుతున్నారు. తద్వారా వికేంద్రీకరణ సాగిందని వెల్లడిస్తున్నారు. ఇప్పుడు రాయలసీమ, కోస్తాలోని చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి.. ఇలా వికేంద్రీకరణ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని.. తద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లున్నాయని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు జగన్ చేసిన ప్రకటనను బట్టి చూస్తే విశాఖకు ఓ అడ్వాంటేజ్ ఉంది.. మరోవైపు కర్నూలు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పుడెలాగో అమరావతిలో కాస్తో కూస్తో బిల్డింగ్స్ ఉన్నాయి గనుక ఇక్కడే చట్టసభలు అని జగన్ తన మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయ్యారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
విశాఖలోనే ఎందుకు!?
పరిపాలనకు అనువైన వాతావరణం, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు విశాఖలో ఉండటం వల్లే పరిపాలన వ్యవహారాలన్నీ ఇక్కడ్నుంచి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. విశాఖలో ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా ఉన్నాయి. పరిపాలన వ్యవహారాలన్నీ విశాఖ నుంచే ఉండొచ్చనే జగన్ ప్రకటనతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉద్యోగులు, ఇతర ఆఫీసులన్నీ విశాఖకు తరలిపోవాలి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కీలకం కావడంతో.. ఇక ఏపీలో విశాఖ మిగతా నగరాల కంటే మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోయే ఛాన్స్ ఉంది.
వికేంద్రీకరణకు వ్యతిరేకమా..!?
మూడు చోట్ల రాజధాని ఉంటే ఉద్యోగులు, ప్రజలు ఎక్కడికి పోవాలి..? అని బాబు సూటి ప్రశ్న సంధించారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే జగన్ ఎక్కడ నివాసం ఉంటారని కూడా బాబు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు కూడా చేస్తామని ప్రకటించారు. అంటే ఆయన వికేంద్రీకరణకు అంటే వ్యతిరేకిస్తున్నారా..? లేకుంటే భూములు పోతున్నాయని బాధపడుతున్నారా..? అనేది పైనున్న పెరుమాళ్లకే ఎరుక. మరి జగన్ సౌతాఫ్రికా ఫార్ములాపై ప్రజలు ఎలా స్పందిస్తారు..? ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తారా..? లేకుంటే ఆందోళన చేపడుతారా..? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout