నిజమెంత వింకీ బ్యూటీ?
Send us your feedback to audioarticles@vaarta.com
`ఒరు ఆడార్ లవ్(తెలుగులో లవర్స్ డే)` సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. తదుపరి సినిమాగా `శ్రీదేవి బంగ్లా` విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో డెబ్యూ ఇవ్వనుందని సినీ వర్గాల సమాచారం. ఒకప్పుడు బన్నితో సినిమా చేసే అవకాశం వస్తే.. వద్దనుకున్న ప్రియా త్వరలోనే నితిన్‌తో సినిమా చేయనుందట. నితిన్ హీరోగా చంద్రశేకర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. భవ్య ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి ప్రియా ప్రకాశ్ తెలుగు ఎంట్రీ గురించి వినపడుతున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments