వామ్మో...అంత ఖర్చయిందా?
Saturday, July 29, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్క సీన్ కోసం రూ.20 కోట్లు ఖర్చుపెట్టడం ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది. అదీ సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమా కోసం. మహేశ్ సినిమాల్లో ఇప్పటిదాకా కనీవిని ఎరుగని బడ్జెట్ రూ.120కోట్లతో తెరకెక్కుతోన్న చిత్రం `స్పైడర్`. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందుతోంది. మొదట ఈ సినిమాకు రూ.90 కోట్ల బడ్జెట్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు బడ్జెట్ పెరిగింది. ఏకంగా రూ.30కోట్ల బడ్జెట్ పెరిగింది. దాంతో రూ.120కోట్లు అయిందని వినికిడి.
మురుగదాస్ గత సినిమాల్లోలాగానే ఈ సినిమాలోనూ ఓ హైలైట్ సీన్ ఉంటుందట. అమాయకులైన ప్రజలను చంపడానికి విలన్ ప్రయత్నిస్తే, హీరో అడ్డుకునే సీన్ అట అది. ఈ సీన్ కోసమే రూ.20కోట్లు ఖర్చుపెట్టారని పిల్మ్ నగర్ సమాచారం. ఈ సీన్లో జూనియర్ ఆర్టిస్టులు భారీగా పాల్గొన్నారట. విజువల్ ఎఫెక్ట్స్ ను కూడా భారీగా చేశారట. ఈ మధ్య స్పైడర్ సెట్లో మహేశ్ సరదాగా ఉన్న ఫొటో విడుదలైంది. సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, అందులో తాజా సీన్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments