వామ్మో...అంత ఖర్చయిందా?

  • IndiaGlitz, [Saturday,July 29 2017]

ఒక్క సీన్ కోసం రూ.20 కోట్లు ఖ‌ర్చుపెట్ట‌డం ఎక్క‌డైనా విన్నారా? ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది. అదీ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు సినిమా కోసం. మ‌హేశ్ సినిమాల్లో ఇప్ప‌టిదాకా క‌నీవిని ఎరుగ‌ని బ‌డ్జెట్ రూ.120కోట్ల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం 'స్పైడ‌ర్‌'. తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపొందుతోంది. మొద‌ట ఈ సినిమాకు రూ.90 కోట్ల బ‌డ్జెట్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు బ‌డ్జెట్ పెరిగింది. ఏకంగా రూ.30కోట్ల బ‌డ్జెట్ పెరిగింది. దాంతో రూ.120కోట్లు అయింద‌ని వినికిడి.
మురుగ‌దాస్ గ‌త సినిమాల్లోలాగానే ఈ సినిమాలోనూ ఓ హైలైట్ సీన్ ఉంటుంద‌ట‌. అమాయ‌కులైన ప్ర‌జ‌ల‌ను చంప‌డానికి విల‌న్ ప్ర‌య‌త్నిస్తే, హీరో అడ్డుకునే సీన్ అట అది. ఈ సీన్ కోస‌మే రూ.20కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ని పిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం. ఈ సీన్‌లో జూనియ‌ర్ ఆర్టిస్టులు భారీగా పాల్గొన్నార‌ట‌. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ను కూడా భారీగా చేశార‌ట‌. ఈ మ‌ధ్య స్పైడ‌ర్ సెట్‌లో మ‌హేశ్ స‌ర‌దాగా ఉన్న ఫొటో విడుద‌లైంది. సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో, అందులో తాజా సీన్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.