అఖిల్ పై త‌మ‌న్ కి కోపం వ‌చ్చిందా..?

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

అఖిల్ మూవీకి ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్.. ఒక‌రు అనూప్ రూబెన్స్.. ఇంకొక‌రు త‌మ‌న్. ఈమ‌ధ్య కాలంలో ఒక సినిమాకి ఇద్ద‌రు టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ వ‌ర్క్ చేయ‌డం అనేది బ‌హుశా అఖిల్ సినిమాకే జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే... అఖిల్ మూవీలో త‌మ‌న్ ఒక్క‌పాటనే అందించారు.

ఒక్క పాటకు మించి ఎక్కువ పాట‌లుకు సంగీతాన్ని అందించే అవ‌కాశం త‌మ‌న్ కి ఇవ్వ‌లేదో...లేక త‌మ‌న్ అందించిన పాట‌లు అఖిల్ టీమ్ కి న‌చ్చ‌లేదో..కానీ అఖిల్ మూవీలో త‌మ‌న్ ఒక్క‌పాట‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో త‌మ‌న్ కి కోపం వ‌చ్చింద‌నుకుంట‌. అందుకే త‌మ‌న్ ట్విట్ట‌ర్ లో డిక్టేట‌ర్, బ్రూస్ లీ...చిత్రాల గురించి చాలా సార్లు ట్వీట్ చేసాడు. కానీ...అఖిల్ మూవీ గురించి ఒక‌సారి మాత్ర‌మే ట్వీట్ చేసాడు. అలాగే....అక్కినేని వంశం నుంచి మూడోత‌రంలో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న అఖిల్ ఫ‌స్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ త‌మ‌న్ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ కు రాక‌పోవ‌డం చూస్తుంటే నిజంగానే త‌మ‌న్ కి కోపం వ‌చ్చింద‌నిపిస్తుంది.

More News

మ‌హేష్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు.

త్వ‌ర‌లో పెద్ద హీరోతో సినిమా : కిట్టు న‌ల్లూరి

తేజ‌స్ హీరోగా న‌టించిన సినిమా కేటుగాడు ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ సినిమాకు కిట్టు న‌ల్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బ‌న్నితో ఐటం సాంగ్ చేస్తున్న భామ‌..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే.

శివబాలాజీ, అజ‌య్ ప్ర‌ధానపాత్ర‌ల్లో సెప్టెంబ‌ర్ 23 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్

‘ఇది అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ’ సినిమాతో తెరంగేట్రం చేసి ‘ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, చంద‌మామ‌, శంభో శివ’ శంభో వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ.

రామ్ చ‌ర‌ణ్ మూవీలో విల‌న్ గా న‌టిస్తున్న హీరో..?

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దానయ్య ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.