తెలంగాణ హోంమంత్రి ఓటు చెల్లనట్టేనా?

  • IndiaGlitz, [Monday,March 15 2021]

తెలంగాణలో పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మహమూద్ అలీ చేసిన ఓ పని ఆయన ఓటును చెల్లని ఓటుగా మార్చేసేందుకు తావిచ్చింది. ఆయన ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం తాను ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ప్రకటిస్తే సరిపోయేది కానీ దానికి తోడుగా.. తాను ఎవరికి ఓటు వేశానో బహిరంగంగా వెల్లడించారు. తాను వాణిదేవికి ఓటు వేసినట్లు మీడియాకు వెల్లడించారు.

అయితే.. కౌంటింగ్ అయిపోయాక ఈ మాట చెబితే ఓకే కానీ ముందుగానే.. అంటే ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరమే తాను ఏ అభ్యర్థికి ఓటు వేశానన్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఎవరికి ఓటు వేశారన్నది బహిరంగంగా వెల్లడించకూడదన్న నిబంధన ఒకటి ఉంది. ఆ నిబంధనను పక్కన పెట్టి హోంమంత్రి మహమూద్ అలీ ఎవరికి ఓటు వేశారో బహిరంగంగా చెప్పేశారు. బూత్ నెం 580 లో తమ పార్టీ అభ్యర్థి వాణిదేవి మేడంకి ఓటు వేశానని బహిరంగంగా వెల్లడించారు.

అయితే ఆయన ఓటు చెల్లుతుందా? లేదా? అన్న విషయాన్ని ఈసీ పరిశీలిస్తోంది. గతంలోనూ ఇలాగే జరిగిన ఓ సందర్భాన్ని ఈసీ గుర్తు చేస్తోంది. గతంలో తాను ఎవరికి ఓటు వేసింది చెప్పిన ఓ వ్యక్తి ఓటును ఈసీ పరిగణలోకి తీసుకోలేదు. ఆయన ఓటు చెల్లదని ఈసీ ప్రకటించింది. ఇప్పుడు హోం మంత్రి మహమూద్ అలీ ఓటును కూడా ఈసీ పరిశీలిస్తోంది. ఆర్వో ఫిర్యాదు అందిన వెంటనే హోంమంత్రి ఓటుపై పరిశీలిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా.. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకూ క్యూలైన్‌లో ఉన్నవారిని మాత్రమే ఓటేసేందుకు అనుమతించారు.

More News

నాన్ వెజ్ పిజ్జా ఇస్తావా?.. రూ.కోటి కట్టాలంటూ కోర్టుకెక్కిన మహిళ

ఈ రోజుల్లో సంప్రదాయం.. చట్టుబండలంటూ పెద్దగా ఎవరూ మడిగట్టుకుని కూర్చోవట్లేదు. శుబ్బరంగా దొరికిన కాడికి వెజ్జా.. నాన్ వెజ్జా అనేది చూసుకోకుండా లాగించేస్తున్నారు.

'కేజీఎఫ్‌' హీరో యశ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌.. హీరో యశ్‌పై రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యశ్‌ తల్లిదండ్రులు ఇటీవల దుద్ధ హోబళి తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో

సరికొత్త గెటప్‌తో అభిమానులను షాక్‌కు గురి చేసిన ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్‌లో ఒక సంచలనం.. ఓ ట్రెండ్ సెట్టర్.. హెలికాఫ్టర్ షాట్స్‌తో చూపు మరల్చుకోనివ్వడు.. ఆటగాడిగా రికార్డులు.. కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన నేపథ్యం అతనిది.

తొలిసారిగా బీజేపీకి ఎదురెళుతున్న పవన్

సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో జనసేన కలిసి నడుస్తోంది. కార్యక్రమం ఏదైనా కలిసే పాల్గొంటున్నాయి. అయితే పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం జనసేన

'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' కోసం ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడంటే..!

సోష‌ల్ మీడియా ఉధృతి పెరిగింది. ముఖ్యంగా డిజిట‌ల్ మీడియా చేతిలోకి వ‌చ్చిన త‌ర్వాత స్టార్స్ గురించిన వివ‌రాలు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి వ‌స్తున్నాయి. స్టార్ హీరోలు సైతం బుల్లితెర‌, డిజిట‌ల్