తెలంగాణ హోంమంత్రి ఓటు చెల్లనట్టేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మహమూద్ అలీ చేసిన ఓ పని ఆయన ఓటును చెల్లని ఓటుగా మార్చేసేందుకు తావిచ్చింది. ఆయన ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం తాను ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ప్రకటిస్తే సరిపోయేది కానీ దానికి తోడుగా.. తాను ఎవరికి ఓటు వేశానో బహిరంగంగా వెల్లడించారు. తాను వాణిదేవికి ఓటు వేసినట్లు మీడియాకు వెల్లడించారు.
అయితే.. కౌంటింగ్ అయిపోయాక ఈ మాట చెబితే ఓకే కానీ ముందుగానే.. అంటే ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరమే తాను ఏ అభ్యర్థికి ఓటు వేశానన్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఎవరికి ఓటు వేశారన్నది బహిరంగంగా వెల్లడించకూడదన్న నిబంధన ఒకటి ఉంది. ఆ నిబంధనను పక్కన పెట్టి హోంమంత్రి మహమూద్ అలీ ఎవరికి ఓటు వేశారో బహిరంగంగా చెప్పేశారు. బూత్ నెం 580 లో తమ పార్టీ అభ్యర్థి వాణిదేవి మేడంకి ఓటు వేశానని బహిరంగంగా వెల్లడించారు.
అయితే ఆయన ఓటు చెల్లుతుందా? లేదా? అన్న విషయాన్ని ఈసీ పరిశీలిస్తోంది. గతంలోనూ ఇలాగే జరిగిన ఓ సందర్భాన్ని ఈసీ గుర్తు చేస్తోంది. గతంలో తాను ఎవరికి ఓటు వేసింది చెప్పిన ఓ వ్యక్తి ఓటును ఈసీ పరిగణలోకి తీసుకోలేదు. ఆయన ఓటు చెల్లదని ఈసీ ప్రకటించింది. ఇప్పుడు హోం మంత్రి మహమూద్ అలీ ఓటును కూడా ఈసీ పరిశీలిస్తోంది. ఆర్వో ఫిర్యాదు అందిన వెంటనే హోంమంత్రి ఓటుపై పరిశీలిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా.. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకూ క్యూలైన్లో ఉన్నవారిని మాత్రమే ఓటేసేందుకు అనుమతించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout