TDP-Janasena: ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ-జనసేన విలీనం..?
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పేరు ఇక వినపడకపోచ్చనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల ముందు బీజేపీతో కలిసి పనిచేసి.. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోడీ, అమిత్ షా సహా కమలం నేతలపై నోటీకొచ్చినట్టు మాట్లాడారు. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడం.. కేంద్రంలో మళ్లీ బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగిపోయాయి.
దీంతో చేసేదేమీ లేక బీజేపీ పెద్దలతో సయోధ్య కోసం చంద్రబాబు అనేకసార్లు ప్రయత్నించినా కనీసం ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. ప్రధాని మోదీని కాదు కదా.. కనీసం అమిత్‌షాను కూడా కలవలేకపోయారు. కానీ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో ఇరుక్కుని అరెస్టయిన తర్వాత.. బీజేపీకి పూర్తిగా లొంగిపోయారన్న ప్రచారం జరిగింది. బాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఎక్కని గడప లేదు. కలవని నాయకుడు లేడు. అంతలా ప్రయత్నించినా చివరకు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి లాబీయింగ్‌తో అమిత్‌షాను కలిశారు. ఈ భేటీలోనే టీడీపీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరమీదికి వచ్చిందని తెలుస్తోంది.
అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో జనసేన విలీనం చేయాలని కేంద్ర పెద్దలు పవన్‌ను అడిగినట్లు తెలుస్తోంది. టీడీపీనీ ఎన్డీయేలోకి తీసుకోవాలని పవన్ కోరినప్పుడే బీజేపీ నేతలు తమ ఆలోచన బయటపెట్టారని సమాచారం. ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేస్తే.. ఏపీలో బీజేపీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారట. అలాగే పవన్‌కు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు హస్తిన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కూడా చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసేందుకు చేయాల్సిందంతా చేశారు.
అనంతరం చంద్రబాబుకు అనారోగ్యం కారణంగా బెయిల్ రావడం.. ఢిల్లీ వెళ్లడంతో మూడు పార్టీల కూటమి ఖాయమైంది. కానీ టీడీపీని విలీనం చేస్తేనే పొత్తు ఉంటుందని మోదీ, షా ద్వయం తేల్చి చెప్పారట. అయితే టీడీపీని విలీనం చేసే అంశంపై ఆలోచించుకోవడానికి సమయం కోరడం వల్లే బీజేపీతో పొత్తు ఆలస్యమైందని ప్రచారం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో స్కిల్ స్కామ్, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ ఇలా అనేక అవినీతి కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ పార్టీ అండ తప్పదని భావించి టీడీపీని విలీనం చేసేందుకు అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, 10 సంవత్సరాల జనసేన పార్టీలు బీజేపీలో విలీనం కావడం ఖాయమనే ప్రచారమైతే జోరుగా జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments