ఆ విష‌యంలో ర‌ష్మిక కంటే త‌మ‌న్నానే బెట‌రా!

  • IndiaGlitz, [Friday,December 27 2019]

ప్ర‌తి టైమ్‌లో స్టార్ హీరోయిన్స్ మ‌ధ్య కోల్డ్ వార్ సినిమాల రూపంలో జ‌రుగుతూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ స‌మంత‌, కీర్తిసురేష్‌, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల‌కు ర‌ష్మిక మంద‌న్న గ‌ట్టి పోటీనిస్తుంద‌నడంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం ఈమె మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రులో న‌టించింది. ఈ సినిమా ముగియ‌గానే బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రంలో న‌టించ‌నుంది.

'స‌రిలేరు నీకెవ్వ‌రు' విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్ అయితే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ర‌ష్మిక కంటే త‌మ‌న్నాదే పైచేయి అని అంటున్నారు. అదేంటి? ర‌ష్మిక హీరోయిన్ క‌దా! ఆమె కంటే త‌మ‌న్నా ఎలా పై చేయి సాధించింద‌నే డౌట్ రాక‌పోదు. అస‌లు విష‌యమేమంటే.. ఈ సినిమాకు ర‌ష్మిక అందుకున్న పారితోష‌కం 80 ల‌క్ష‌ల రూపాయ‌లైతే.. త‌మ‌న్నా.. కేవ‌లం ఓ సాంగ్ చేసినందుకు 40 ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంద‌ట‌. ఓ సాంగ్ అంటే మూడు నుండి నాలుగు రోజుల ప‌నే ఉంటుంది. ఆ లెక్క‌న చూస్తే ర‌ష్మిక కంటే త‌మ‌న్నాదే పైచేయి క‌దా!.

మ‌హేష్‌, ర‌ష్మిక జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నారు.

More News

డ‌బ్బింగ్ పూర్తి చేసిన మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`.  దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

విజయసాయి మాటకు లెక్కలేకుండా పోయిందా!?

నవ్యాంధ్ర మూడు రాజధానులపై ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మాట.. తాజాగా మంత్రి పేర్ని నాని మరో మాట చెప్పారు.

సీబీఐ రంగంలోకి దిగితే వైసీపీ, టీడీపీ నేతల పరిస్థితేంటి!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ వర్సెస్ టీడీపీ అధినేత చంద్రబాబుగా పరిస్థితులు మారనున్నాయా..?.

రాజధాని మార్చే అధికారం మీకెక్కడిది!?: చంద్రబాబు

ఏపీ కెబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

అమరావతి రైతులకు హామీ ఇచ్చిన మంత్రి నాని

నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అమరావతి ప్రాంతంలో రైతులు రాస్తారోకోలు, ర్యాలీకి దిగారు.