తమన్నా రాజకీయాలు నేర్చుకుంటుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్‌ఫుల్‌గా వెలిగిన వారు రాజకీయాల్లోకి వెళ్లడం అనేది మన దగ్గర కొత్తేమీ కాదు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లోనూ పలువురు సినీ ప్రముఖులు తమ సత్తాను నిరూపించుకున్నారు. భవిష్యత్తులో వారి బాటలో తమన్నా అడుగులు వేస్తారా? ఏమో చెప్పలేమనే అంటున్నారు తమన్నా. ఇటీవల చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ``నాకు రాజకీయాల గురించి అసలు ఏమీ తెలియదు. ఒకవేళ భవిష్యత్తులో తెలుసుకోవాల్సి వస్తే తెలుసుకుంటాను.
వచ్చే ఐదేళ్లలో దాని గురించి కూడా నేర్చుకుంటానేమో. ప్రస్తుతానికి మాత్రం రాజకీయాల పట్ల నాకు అవగాహన లేదు`` అని చెప్పారు. పెళ్లి గురించి మాట్లాడుతూ ``మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా.మంచి వరుడు ఉంటే చూడమని ఈ మధ్యే దర్శకుడు విజయ్‌కి కూడా చెప్పా. మీరందరూ చూడండి. మంచి వాడుంటే చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments