తమన్నా రాజకీయాలు నేర్చుకుంటుందా?
- IndiaGlitz, [Saturday,June 01 2019]
సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్‌ఫుల్‌గా వెలిగిన వారు రాజకీయాల్లోకి వెళ్లడం అనేది మన దగ్గర కొత్తేమీ కాదు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లోనూ పలువురు సినీ ప్రముఖులు తమ సత్తాను నిరూపించుకున్నారు. భవిష్యత్తులో వారి బాటలో తమన్నా అడుగులు వేస్తారా? ఏమో చెప్పలేమనే అంటున్నారు తమన్నా. ఇటీవల చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ''నాకు రాజకీయాల గురించి అసలు ఏమీ తెలియదు. ఒకవేళ భవిష్యత్తులో తెలుసుకోవాల్సి వస్తే తెలుసుకుంటాను.
వచ్చే ఐదేళ్లలో దాని గురించి కూడా నేర్చుకుంటానేమో. ప్రస్తుతానికి మాత్రం రాజకీయాల పట్ల నాకు అవగాహన లేదు'' అని చెప్పారు. పెళ్లి గురించి మాట్లాడుతూ ''మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా.మంచి వరుడు ఉంటే చూడమని ఈ మధ్యే దర్శకుడు విజయ్‌కి కూడా చెప్పా. మీరందరూ చూడండి. మంచి వాడుంటే చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు'' అని అన్నారు.