సురేంద‌ర్ రెడ్డి ఎటు వైపు మొగ్గుతాడు?

  • IndiaGlitz, [Monday,June 15 2020]

ద‌ర్శ‌కుడిగా ప‌దిహేనేళ్ల కెరీర్ ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది మాత్రం తొమ్మిది సినిమాలు మాత్ర‌మే.. ఆ ద‌ర్శ‌కుడెవ‌రు కాదు, సురేంద‌ర్ రెడ్డి. స్టైలిష్ ఫిలిమ్ మేక‌ర్‌గా పేరున్న సురేంద‌ర్ రెడ్డి గ‌త చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. భారీ హిస్టారిక‌ల్ సినిమా. అనుకున్న స్థాయి విజ‌యాన్ని మాత్రం ద‌క్కించుకోలేపోయింది. అయితే సురేంద‌ర్ రెడ్డికి నెక్ట్స్ అవ‌కాశం వెంట‌నే రాలేదు. అస‌లు సురేంద‌ర్ రెడ్డి ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేకుండా ఉంది. ఈ స్టైలిష్ డైరెక్ట‌ర్ మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో క్రిష్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తాడ‌ని రీసెంట్‌గా వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే.

అయితే రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో సురేంద‌ర్ రెడ్డి ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. నిర్మాత అల్లు అర‌వింద్ ఆహా అనే తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిలో కంటెంట్ కోసం ఆయ‌న ప‌లువురు ద‌ర్శ‌కుల‌ను, ర‌చ‌యిత‌ల‌ను క‌లుస్తున్నాడు. అందులో భాగంగా సురేంద‌ర్ రెడ్డిని ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయ‌మ‌ని అన్నాడ‌ట‌. చారిత్రాత్మ‌క‌మైన కంటెంట్ వెబ్ సిరీస్‌ను సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి సురేంద‌ర్ చివ‌ర‌కు సినిమా చేస్తాడో లేక వెబ్ సిరీస్ చేస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.