సుమంత్ నమ్మకం ఫలిస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎం.ఎస్.రాజు తనయుడు అనే ట్యాగ్‌లైన్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ అశ్విన్. 'అంతకు ముందు ఆ తరువాత', 'లవర్స్', 'కేరింత' వంటి హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ నెల 22న 'కొలంబస్'గా పలకరించేందుకు సిద్ధమయ్యాడు సుమంత్. ఈ సినిమా ద్వారా ఆర్.సామల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తన కెరీర్‌లో తొలిసారిగా ఓ కొత్త దర్శకుడితో 'చక్కిలిగింత' అనే సినిమా చేసి డిజాస్టర్‌ని మూటగట్టుకున్నాడు సుమంత్. మళ్లీ అదే బాటలో ఇంకో కొత్త డైరెక్టర్‌ని నమ్మి ఛాన్స్ ఇచ్చింది 'కొలంబస్' కోసమే. మరి అతని నమ్మకం ఈ సారైనా ఫలిస్తుందా? దసరా వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments