మ‌ణిర‌త్నం బాట‌లో సుకుమార్‌..?

తెలుగు చిత్ర‌సీమ‌లో నేటిత‌రం బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో సుకుమార్ ఒక‌రు. ‘రంగ‌స్థ‌లం’ త‌ర్వాత అల్లు అర్జున్‌తో ‘పుష్ప‌’ అనే ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కానేలేదు. అయితే లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన గ్యాప్‌ను సుకుమార్ వేస్ట్ చేయ‌డం లేద‌ట‌. ఒక‌వైపు ఉప్పెన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేశారు. అంతే కాదండోయ్‌.. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఓటీటీ ట్రెండ్‌కు త‌గిన విధంగా వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నార‌ట సుకుమార్‌. అయితే ఏదో రెగ్యుల‌ర్ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించాల‌నే త‌ర‌హాలో కాకుండా త‌న‌దైన స్టైల్లో డిఫ‌రెంట్ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశార‌ట సుకుమార్‌. తొమ్మిది ల‌వ్‌స్టోరీస్‌తో సుకుమార్ ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది మంది హీరోలు న‌టిస్తే.. తొమ్మిది మంది ద‌ర్శ‌కులు దీన్ని తెర‌కెక్కిస్తార‌ని టాక్‌. ఈ వెబ్ సిరీస్‌ను ఓ ప్ర‌ముఖ సంస్థ‌తో క‌లిసి సుకుమార్ నిర్మిస్తార‌ని స‌మాచారం.

అయితే ఇదే పంథాలో వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించ‌డానికి ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్న ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశారు. ఆయ‌న ‘నవరస’ అనే పేరుతో వెబ్ సిరీస్ చేయనున్నారు. ఇందులోనూ తొమ్మిది మంది హీరోలు న‌టిస్తే.. తొమ్మిది మంది ద‌ర్శ‌కులు డైరెక్ట్ చేస్తార‌ట‌. చూస్తుంటూ మ‌ణిర‌త్నం, సుకుమార్ ఐడియాల‌జీ ఒకేలా అనిపిస్తుంది.

More News

రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై కీలక వార్త వెలుగులోకి..

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని దేశాలూ పోటాపోటీగా కృషి చేస్తున్నాయి.

ఎండ తగలకుండా ఇంటికే పరిమితమయ్యారా?.. అదీ డేంజరేనట..

విటమిన్ డి లోపం ఉన్న వారికి కూడా కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే.

రీమేక్‌లో నాగ్‌... యంగ్ డైరెక్ట‌ర్ కోసం అన్వేష‌ణ‌!!

కింగ్ నాగార్జున గ‌త ఏడాది `మ‌న్మ‌థుడు 2`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

ప్లాస్మా డోనర్ పేరుతో బడా మోసం.. 200 మంది నుంచి డబ్బు వసూలు..

కరోనా కారణంగా చావుకి దగ్గరైన వ్యక్తులను బతికించేందుకు చిట్టచివరి ఆయుధంగా వైద్యులు ప్లాస్మాను ప్రయోగిస్తున్నారు.

ఎన్ 95 మాస్కులు కరోనాను కట్టడి చేయలేవు: డీజీహెచ్ఎస్

ఎన్ 95 మాస్కుల వినియోగంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) కీలక ప్రకటన చేసింది.