చిరుతో క‌లిసి న‌టించ‌నున్న స్టైలిష్ స్టార్‌..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌. వెంట‌నే త‌న 153వ సినిమా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ పాత్ర‌ను చిరంజీవి చేస్తుండ‌గా, సినిమాను డైరెక్ట్ చేసిన హీరో పృథ్వీరాజ్ అందులో ఓ కీల‌క పాత్ర‌లో,హీరో అనుచ‌రుడిగా న‌టించాడు. మ‌రి తెలుగులో ఆ పాత్ర‌ను ఎవ‌రు చేస్తారు? అనే దానిపై పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ముఖ్యంగా రామ్‌చ‌ర‌ణే చేస్తాడ‌నే వార్త‌లు ఎక్కువ‌గా విన‌ప‌డ్డాయి కూడా. అయితే తాజా స‌మాచారం మేర‌కు లూసిఫ‌ర్ తెలుగు రీమేక్‌లో చిరంజీవి అనుచ‌రుడి పాత్ర‌లో బ‌న్నీ న‌టిస్తాడ‌ని టాక్ వ‌స్తుంది.

గ‌తంలో చిరంజీవి డాడీ చిత్రంలో బ‌న్నీ ఓ చిన్న పాత్ర చేశాడు. అప్ప‌టికి త‌నింకా హీరో కాలేదు. త‌ర్వాత శంక‌ర్ దాదా జిందాబాద్‌లోనూ ఓ పాట‌లో చిరుతో క‌లిసి స్టెప్పేశాడు. ఇప్పుడు ఇంకా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో నటించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. మ‌రి సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి. సాహో పేమ్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయి. క‌రోనా ప్ర‌భావం ముగిసిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించి మ‌రింత స‌మాచారం తెలిసే అవ‌కాశం ఉంది.

More News

తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ అండ

కరోనా ప్రభావంతో ప్రపంచమంతా స్తబ్దుగా మారింది. మన దేశం విషయానికి వస్తే మే 3 వరకు లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో సామాన్య ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.

ఉపేంద్ర - చంద్రు కాంబినేషన్‌లో 'కబ్జా' ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా 'కబ్జా'. శ్రీధర్ లగడపాటి సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

కరోనాతో పోల్చితే బిన్ లాడెన్ ఓ బచ్చా: ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశంపై అయినా సరే తనదైన శైలిలో విమర్శలు,

జగన్ క్యాంప్ ఆఫీస్‌లో కీలక మార్పు.. ధర్మచక్రం ఔట్!

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తనదైన శైలిలో పరిపాలన ముద్ర వేసుకోవడానికి తహతహలాడుతున్నారు.

షాకింగ్..: ఇవాళ ఒక్కరోజే తెలంగాణలో 50 కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 50 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదవ్వడం షాకింగ్ గురి చేస్తోంది.