స్పెషల్ సాంగ్ చేస్తుంది...అందుకేనా..ఏమో?

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌, రకుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా సురేంద‌ర్‌రెడ్డి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ధ‌వ‌. త‌మిళ చిత్రం త‌నీ ఒరువ‌న్‌కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. ఈ సినిమాలో కాజ‌ల్ న‌టించ‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అయితే హీరోయిన్ ర‌కుల్ అన్నారు క‌దా, అనే డౌట్ వ‌స్తుంది. అది నిజ‌మే ర‌కుల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే కాజ‌ల్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌న‌ప‌డ‌నుంద‌ట‌. చ‌ర‌ణ్‌, కాజ‌ల్ జోడి మ‌గ‌ధీర‌, నాయ‌క్‌, గోవిందుడు అంద‌రివాడేలే చిత్రాల‌తో హ్యాట్రిక్ స‌క్సెస్‌ల‌ను సాధించారు.

ఈ జోడికి మంచి క్రేజ్ కూడా ఉంది. ఈ క్రేజ్‌ను ఉప‌యోగించుకోవాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారేమో కాజ‌ల్‌తో ఓ స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేశార‌ని అంటున్నారు. ఈ ఏడాది కాజ‌ల్ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, బ్ర‌హ్మోత్స‌వం వంటి పెద్ద చిత్రాలు ప్లాప్ కావ‌డంతో పాటు బాలీవుడ్‌లో కాజ‌ల్ నటించిన దో ల‌ప్జోన్‌కి క‌హానీ కూడా నిరాశ ప‌రిచింది. దాంతో కాజ‌ల్ టాలీవుడ్ ప్రేక్ష‌కులు త‌న‌ను మ‌ర‌చిపోకుండా ఉండ‌టానికే ఈ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ని అంటుండ‌గా, అదేం లేదు చ‌ర‌ణ్‌తో కాజ‌ల్‌కు ఉన్న స్నేహం కార‌ణంగానే ఈ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. అస‌లు స్పెష‌ల్ సాంగ్ గొడ‌వేంటో కాజ‌ల్ కానీ, యూనిట్ వారు కానీ చెబితే స‌ద్దుమ‌ణిగేలా లేదు.

More News

రెండు ద‌శాబ్దాల త‌ర్వాత విల‌న్ గా...

కెరీర్ స్టార్టింగ్ లో చిన్న క్యారెక్ట‌ర్స్‌ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ త‌ర్వాత విల‌న్ గా కూడా ప‌లు చిత్రాల్లో న‌టించాడు., త‌ర్వాత హీరోగా మారిన త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారిపోయాడు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'త్రయం'

విషు రెడ్డి,అభిరామ్,సంజన,అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతొన్న చిత్రం 'త్రయం'.

కమల్ హాసన్ గారు తర్వాత నా అభిమాన హీరో అతనే - నివేథా థామస్

నాని,ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం జెంటిల్ మన్.ఈ చిత్రంలో నాని సరసన నివేథా థామస్,సురభి నటించారు.

జక్కన్న టీజర్ రిలీజైంది.

కమెడియన్ టర్నడ్ కథానాయకుడు సునీల్ నటించిన తాజా చిత్రం జక్కన్న.

మంచు విష్ణు భార్యకు గాయాలు...

మంచు మోహన్ బాబు పెద్ద తనయుడు మంచు విష్ణు సతీమణి విరోనికా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.