ప‌వ‌న్‌కు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందా?

  • IndiaGlitz, [Monday,November 04 2019]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. 2018 జ‌న‌వ‌రిలో విడులైన అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో బిజీగా మారిపోయాడు. ఎన్నిక‌లు ముగియ‌డంతో.. ఉన్న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేయ‌డానికి ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈయ‌న బాలీవుడ్ చిత్రం పింక్‌ను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాడు. దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మించ‌బోయే ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. హిందీలో అమితాబ్ పాత్ర‌ను ప‌వ‌న్ పోషించ‌బోతున్నారు. హిందీలో హీరోయిన్ లేదు.

అయితే త‌మిళంలో అజిత్ స‌ర‌స‌న విద్యాబాల‌న్ హీరోయిన్‌గా చిన్న పాత్ర‌లో న‌టించింది. ఇప్పుడు అదే పాత్ర‌ను ప‌వ‌న్ పోషిస్తున్నాడు. త‌మిళంలో విద్యాబాల‌న్ పాత్ర‌కు న‌య‌నతార‌ను తీసుకోవాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ట‌. అయితే న‌య‌న‌తార చాలా బిజీ హీరోయిన్‌.. పాత్ర న‌చ్చితే చేస్తుంది. అది కూడా హై రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. మ‌రి అన్ని న‌చ్చినా డేట్స్ కుదరాలి. ఇవ‌న్నీ దాటుకుని న‌య‌న‌తార ప‌వ‌న్‌కు ఓకే చెబుతుందో లేదో చూడాలి. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఆయ‌న అభిమానుల‌కు ఆనందం క‌లిగించే విష‌య‌మే. మ‌రి డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్, ప‌వ‌న్ పాత్ర‌ను ఎలా డిజైన్ చేస్తాడోన‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.